Water Benefits: ఉదయం లేవగానే నీరు తాగుతున్నారా? జరిగేది ఇదే..

కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. పూర్వ కాలంలో మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్దతులు పాటించారు. ముఖ్యంగా వేసవి కాలంలో డీ హైడ్రేషన్ కాకుండా ఎక్కువగా నీరు తాగేవారు.

Written By: Chai Muchhata, Updated On : December 8, 2023 6:17 pm

Water Benefits

Follow us on

Water Benefits: మానశ శరీరానికి నీరు అత్యంత అవసరం. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు దానిని పిండి చేసే గుణం నీరుకు ఉంటుంది. అందువల్ల శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 70 శాతం నీరు ఉండే దేహంలో ఒక్కోసారి ఇది తక్కువగా అవుతుంది. దీంతో డీ హైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఫలితంగా అనేక రోగాలకు దారి తీస్తోంది. భూమ్మీద జీవి మనుగడకు నీరు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానవ శరీరానికి నీరు ప్రధానంగా ఉంటుంది. అయితే ఉదయం లేవగానే చాలా మంది నీరు తాగేందుకు ఇష్టపడుతారు. ఉదయం లేచిన తరువాత నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందంటే?

కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. పూర్వ కాలంలో మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్దతులు పాటించారు. ముఖ్యంగా వేసవి కాలంలో డీ హైడ్రేషన్ కాకుండా ఎక్కువగా నీరు తాగేవారు. అయితే దీనికో ప్రణాళిక వేసేవారు. రాత్రంతా ఒక పాత్రలో నీటిని ఉంచి.. ఉదయం లేవగానే వెంటనే తాగేవారు. దీంతో రాత్రంతా ఆహారం జీర్ణమై ఉండి లేవగానే నీరు తీసుకోవడం వల్ల కడుపు క్లీన్ అవడానికి ఉపకరిస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఇలా తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పనుల బిజీలో పడి సాధారణ సమయంలోనూ నీటిని తీసుకోవడానికి శ్రద్ధ చూపడం లేదు.

శరీరంలో నీటి శాతం తగ్గితే ముందుగా డీ హైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ఆ తరువాత దీని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. నీటిని ఎక్కువగా తీసుకోకపోతే కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఎక్కువగా నీటిని తీసుకోకపోతే తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో అది డైజేషన్ కాకుండా అలాగే ఉండిపోయి కొవ్వులా మారుతుంది. ఆ తరువాత లావు అవుతారు. రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు నీటిని తీసుకోకపోతే రక్త ప్రసరణ పై కూడా ప్రభావం ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబతుున్నారు.

అయితే ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఉదయం లేవగానే నీరు తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. రాత్రంతా చాలా సేపు నిద్రలో ఉండడం వల్ల శరీరానికి నీరు అందదు. వేసవి కాలంలో అయితే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. అందువల్ల ఉదయం లేవగానే నీటిని తీసుకుంటే శరీరాన్ని సమతుల్యంలో ఉంచిన వారవుతారు. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం లేవగానే వేడినీరు తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.