Health: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే అవకాశం?

Health: ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మంచి నీళ్లు తాగడానికి ఎక్కువమంది ప్లాస్టిక్ బాటిల్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం మనిషి లైఫ్ లో మొత్తం 44 పౌండ్ల ప్లాస్టిక్ శరీరంలోకి వెళుతుంది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. ప్లాస్టిక్ లో […]

Written By: Navya, Updated On : December 2, 2021 8:11 pm

disadvantages-of-drinking-water-in-plastic-bottles

Follow us on

Health: ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మంచి నీళ్లు తాగడానికి ఎక్కువమంది ప్లాస్టిక్ బాటిల్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం మనిషి లైఫ్ లో మొత్తం 44 పౌండ్ల ప్లాస్టిక్ శరీరంలోకి వెళుతుంది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది.

Plastic Bottles

ప్లాస్టిక్ లో ఉండే థాలేట్స్ అనే కెమికల్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కెమికల్ మగవారిలో శుక్ర కణాల సంఖ్యను కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే ఆ ప్రభావం ఇమ్యూనిటీ పవర్ పై పడుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో రిలీజయ్యే కెమికల్స్ మానవుల యొక్క నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దాని నుంచి బైఫినైల్‌ అనే కెమికల్ రిలీజయ్యే ఛాన్స్ ఉంటుంది.

Also Read: క్యాబేజీ కర్రీ చేస్తున్నప్పుడు ఈ పొరపాటు చేస్తే మాత్రం అనారోగ్యం పాలవ్వాల్సిందే?

బైఫినైల్‌ కెమికల్ మనుషుల ప్రవర్తనలో మార్పు, ఒబెసిటీ, సంతాన సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ కెమికల్ వల్ల యుక్త వయస్సులో రుతుస్రావం రావడం వంటి సమస్యలు చిన్నారుల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ నేరుగా సూర్యకాంతిని తాకితే డియాక్సిన్ అనే ఒక రకమైన కెమికల్ రిలీజవుతుంది. ఈ కెమికల్ వల్ల మహిళలలో రొమ్ము క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లను తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మట్టి పాత్రల్లో, కాపర్ పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

Also Read: టీ తాగిన తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి.. ఎదుకంటే?