Manchu Family: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి మరణం మొత్తం తెలుగు చలన చిత్ర సీమకే విషాదకరమైన సంఘటన. మరి మంచు కుటుంబానికి కాదా ? సినీ ప్రముఖులు, అభిమానులు సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం కూడా ‘సిరివెన్నెల’ గారి అంతిమయాత్రలో పాల్గొని మహాప్రస్థానం వరకు వెళ్లారు. ఆయనను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, జనాలు అంతిమయాత్రకు కూడా తరలివచ్చారు.
కానీ మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పిస్తే.. మంచు ఫ్యామిలీ మాత్రం సైలెంట్ గా ఉంది. దాంతో నెటిజన్లకు మంచు విష్ణు మళ్లీ టార్గెట్ అయ్యాడు. జనానికి కష్టాలొస్తే సినిమా కష్టాలొచ్చాయని తమ బాధను రెట్టింపు చేసుకుని చెప్పుకుంటారు. మరి, సినిమా వాడికే కష్టాలొస్తే ఏమి చేయాలి ? ఎవరికీ చెప్పుకోవాలి ?
ఎవరికీ చెప్పుకోలేక, మా అసోసియేషన్ ను పెట్టుకున్నారు. ఏ సినిమా వాడికి కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ ‘మా’ అధ్యక్షుడు ముందుకు రావాలి. కానీ మంచు విష్ణు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి నెలలు గడిచిపోతున్నాయి. కానీ కనీసం సినీ దిగ్గజాలు చనిపోయినా అటు వైపు తొంగి చూడటం లేదు.
సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ కోవిడ్ బారిన పడి కోమాలో ఉన్న సమయంలో సాయం కోసం అందర్నీ వేడుకున్నారు ఆ కుటుంబం. అప్పుడూ మన మా అధ్యక్షుడి నుంచి స్పందన లేదు. చివరకు శివశంకర్ మాస్టర్ చనిపోయారు. ఆయనను చివరి చూపు చూడటానికి కూడా ఏ సినీ ప్రముఖుడు వెళ్లలేదు. మరి మా అధ్యక్షుడు ఏమి చేస్తున్నట్లు ?
Also Read: సంప్రదాయ పద్దతిలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు… ఇక సెలవు
ఇక మహా రచయిత సిరివెన్నెల గారు చనిపోయిన సందర్భంలోనూ మంచు విష్ణు నుంచి కనీస పలకరింపు కూడా లేకపోవడం అంటే.. ఆది కూడా మా ప్రెసిడెంట్ గా ఉండి.. దుదృష్టకరమే. అయితే విచిత్రంగా సినీ పెద్దగా చలామణి అవుతున్న మోహన్ బాబు సైతం మౌనంగా ఉన్నారే తప్ప, సిరివెన్నెల మరణం పై స్పందించలేదు.
అసలు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏమి చేస్తున్నాడు ? ఒకపక్క ఏపీ సర్కార్ చట్టాలు మార్చి సినిమా పరిశ్రమను తీవ్రంగా దెబ్బ తీస్తుంటే.. ఇదేంటని నిలదీసే బాధ్యత మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణుకి ఉంది కదా ? మరి మంచు బాబు ఎందుకు మౌనంగా ఉన్నాడు ?
Also Read: కవీశ్వరుడు సీతారాముడికి వాణేశ్వరుడు ఇళయరాజా కవితాత్మక