Food Coma: భోజనం చేసిన వెంటనే నిద్రపోతున్నారా.. ప్రమాదకరమైన సమస్యలు వచ్చే ఛాన్స్?

Food Coma: మనలో చాలామంది మధ్యాహ్నం సమయంలో, రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తిన్న వెంటనే నిద్ర వచ్చే స్థితిని పోస్ట్‌ప్రాండియల్ సోమనోలెన్స్ పేరుతో పిలుస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యను అధిగమించే అవకాశం […]

Written By: Navya, Updated On : March 13, 2022 9:16 am
Follow us on

Food Coma: మనలో చాలామంది మధ్యాహ్నం సమయంలో, రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తిన్న వెంటనే నిద్ర వచ్చే స్థితిని పోస్ట్‌ప్రాండియల్ సోమనోలెన్స్ పేరుతో పిలుస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు ఉంటాయి.

ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యను అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తినే సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజూ కనీసం 8 గంటల పాటు నిద్ర ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆహారం పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా ఆహారం తీసుకుంటే శరీరానికి నష్టమే తప్ప లాభం కలగదు.

సమతుల్యంగా ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శరీరంలో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ ఎక్కువైతే సెరోటోనిన్ స్థాయి పెరిగి ఈ ఆరోగ్య సమస్య వస్తుంది. తిన్న తరువాత నిద్ర ఎక్కువగా వస్తుంటే కొన్నిసార్లు మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది.

వైద్యులు ఈ ఆరోగ్య సమస్యను ఫుడ్ కోమా అని పిలుస్తారు. ఎక్కువగా ఆహారం తినేవాళ్లలో ఈ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లకు ఏ పని చేయాలని అనిపించదు. ఎల్లప్పుడూ ఏకాగ్రతతో ఉండాలని భావించేవాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ ఆరోగ్య సమస్యతో బాధ పడుతుంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.