Mobile Phone: మహిళలు ఫోన్ ను ఎక్కువ ఉపయోగిస్తున్నారా? అయితే అంతే సంగతులు..

విరామం లేకుండా మొబైల్ వాడుతుంటారు కొందరు. దీన్ని మొబైల్ అడిక్షన్ అంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు పిల్లలే కాదు, ఇంట్లోని పెద్దలు కూడా అతుక్కుపోతున్నారు.

Written By: Swathi, Updated On : May 22, 2024 4:12 pm

Mobile Phone

Follow us on

Mobile Phone: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అరచేతిలో ఫోన్ తో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఫోన్ చాలా అలవాటుగా మారింది కూడా. తినడం, పడుకోవడం, నీరు త్రాగడం మాదిరి ప్రాథమిక అవసరంగా మారిపోయింది ఫోన్. చిన్నా.. పెద్ద..అనే తేడా లేకుండా ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల మన జీవన విధానం ఎంత సౌకర్యవంతంగా మారిందో, దాని వల్ల అంతే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది. అధిక సమయం మొబైల్ వాడటం వల్ల తెలియకుండా చాలా జబ్బుల బారిన పడుతున్నారు.

విరామం లేకుండా మొబైల్ వాడుతుంటారు కొందరు. దీన్ని మొబైల్ అడిక్షన్ అంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు పిల్లలే కాదు, ఇంట్లోని పెద్దలు కూడా అతుక్కుపోతున్నారు. మరి ఇలా చేయడం వల్ల ఏం నష్టం ఉందో తెలుసా? ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని మొబైల్ ఉపయోగిస్తే, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మహిళలు గర్భాశయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మొబైల్ అడిక్షన్ వల్ల గర్భాశయ ఎముకలకు సంబంధించిన సమస్య తలెత్తుతుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల తరచూ భుజాలు, మెడ, తలలో నొప్పితోపాటు దిగువ వీపుకు ఇది వ్యాపించే అవకాశం ఉందట. గర్భాశయ నొప్పి కొన్నిసార్లు విపరీతంగా రావడం వల్ల లేవడం, కూర్చోవడం, పని చేయడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. గర్భాశయ సమస్యల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ గంటల తరబడి ఫోన్ చూడటం కూడా పెద్ద సమస్య అంటున్నారు నిపుణులు.

ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళతుంటారు. దాని కారణంగా వారి శరీర పటుత్వం కోల్పోతారు. ఇలాగే కొనసాగితే మహిళల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతాయట. మెడ కదిలేటప్పుడు నొప్పి చేతులలో నొప్పి వెనుకభాగంలో బిగుతుగా అనిపించడం అదేపనిగా తలనొప్పి రావడం భుజాలు నొప్పి వంటివి గర్భాశయ సమస్యకు లక్షణాలు. అందుకే ఫోన్ ను ఉపయోగించడం చాలా తక్కువ చేయాలి అంటున్నారు నిపుణులు.