Kalki 2898 AD: వామ్మో కల్కిలో బుజ్జి కోసం రూ. 7 కోట్లు ఖర్చు పెట్టారా? ఇంతకీ ఎవరా బుజ్జీ?

రీసెంట్ గా కల్కి సినిమా నుంచి భైరవ బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్ తో ఓ వీడియో చూపించారు చిత్ర యూనిట్. బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అని టాక్. ఈ వాహనాన్ని స్పెషల్ గా తయారు చేశారట.

Written By: Swathi, Updated On : May 22, 2024 4:02 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా కల్కీ. ఈ సినిమా మీద రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లాంటి చాలా మంది స్టార్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు మరికొంతమంది గెస్ట్ అప్పీరెన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతో సినిమా హాలీవుడ్ రేంజ్ తెరకెక్కుతుందని అంచనాలు నెలకొన్నాయి.

అయితే రీసెంట్ గా కల్కి సినిమా నుంచి భైరవ బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్ తో ఓ వీడియో చూపించారు చిత్ర యూనిట్. బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అని టాక్. ఈ వాహనాన్ని స్పెషల్ గా తయారు చేశారట. గతంలో కల్కి సినిమా మొదలుపెట్టినప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రని కలిసి ఈ సినిమా కోసం స్పెషల్ గా వెహికల్స్ కావాలి అని తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నారు అని సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు గతంలోనే వైరల్ అయ్యాయి.

ఈ వెహికల్ ను ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు చేసి మరీ తయారు చేయించారట. సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో ప్రత్యేకంగా దీన్ని వాడతారని, ఈ వెహికల్ గాల్లోకి కూడా ఎగురుతుంది అని సమాచారం అందుతుంది. కేవలం సినిమాలో ఒక్క వాహనం కోసం ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి స్పెషల్ గా రెండు కోట్లు పెట్టి బులెట్స్ పేల్చే జాకెట్ కూడా తయారుచేశారని టాక్. తెలిసిన విశేషాలు ఇన్ని ఉంటే తెలియనివి ఎన్ని ఉన్నాయో అని అనుకుంటున్నారు అభిమానులు.