https://oktelugu.com/

పిల్లలకు పీడకలలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా..?

మనలో చాలామందికి నిద్రపోతున్న సమయంలో పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ పీడకలలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. అయితే పీడకలలు వచ్చినా పెద్దలు వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు. అయితే చిన్నపిల్లలు మాత్రం పీడకలలు వస్తే భయాందోళనకు గురవుతూ ఉంటారు. పీడకలల వల్ల పిల్లలు భయపడితే తల్లిదండ్రులు సైతం ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు. Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..? కొంతమంది చిన్నపిల్లలు పీడకలలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2020 / 12:36 PM IST
    Follow us on

    మనలో చాలామందికి నిద్రపోతున్న సమయంలో పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ పీడకలలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. అయితే పీడకలలు వచ్చినా పెద్దలు వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు. అయితే చిన్నపిల్లలు మాత్రం పీడకలలు వస్తే భయాందోళనకు గురవుతూ ఉంటారు. పీడకలల వల్ల పిల్లలు భయపడితే తల్లిదండ్రులు సైతం ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు.

    Also Read: తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    కొంతమంది చిన్నపిల్లలు పీడకలలు వస్తే ఏకంగా జ్వరం బారిన పడుతున్నారు. అయితే పిల్లలకు ఎప్పుడో ఒకసారి పీడకలలు వస్తే పరవాలేదు కానీ తరచూ పీడకలలు వస్తూ ఉంటే మాత్రం కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పిల్లలను పీడకలల నుంచి బయటపడేయటం సాధ్యమవుతుంది. పిల్లలకు పీడకలలు రాకూడదంటే వాళ్లకు తగినంత విశ్రాంతి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు నిద్రపోయే సమయంలో వారికి ప్రశాంతత ఉండేలా చూడాలి.

    Also Read: రోజూ తేనె తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    చాలామంది పిల్లలు కొన్ని విషయాలను తల్లిదండ్రులతో చెప్పుకోలేక పోతూ ఉంటారు. పిల్లలు కొన్ని ఎమోషన్స్ ను చెప్పుకోలేకపోయినా, ఏదైనా భయపెట్టే ఘటన జరిగినా పిల్లలకు పీడకలలు వస్తాయి. అందువల్ల పిల్లలకు తల్లిదండ్రులు ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలు ఏదైనా మంచి పని చేసినా, విజయం సాధించినా వాళ్లను ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల పిల్లలు సంతోషంగా ఉండటంతో పాటు ఏ విషయాలనైనా ఫ్రీగా చెప్పుకుంటారు.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    పిల్లలు నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు ఇవ్వడం, భయపెట్టే సినిమాలు చూపించడం చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలకు పీడకలలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.