Homeఅత్యంత ప్రజాదరణతెలంగాణలో బీజేపీ నయా ప్లాన్.. ఈసారి పక్కా..!

తెలంగాణలో బీజేపీ నయా ప్లాన్.. ఈసారి పక్కా..!

Telangana BJP
ఉత్తరాదిలో ఎదరులేకుండా దూసుకెళుతున్న బీజేపీ దక్షిణాదిలోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లురుతోంది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలోనూ బీజేపీ బలపడేందుకు అవకాశాలు మొండుగా కన్పిస్తున్నాయి.

Also Read: ‘దొర’పై మరోసారి నిప్పులు చెరిగిన రాములమ్మ..!

దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ వేవ్ కన్పిస్తోంది. బీజేపీ శ్రేణులు కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావడమే ఖాయమని అధిష్టానం భావిస్తోంది. దీంతో 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. దీంతో ఇప్పటి నుంచి గ్రామగ్రామాన పార్టీని విస్తరించేందుకు రాష్ట్ర నాయకత్వం సన్నహాలు చేస్తోంది. తెలంగాణలో త్రిపుర తరహా ఫార్మూలాతో ముందుకెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈమేరకు కొందరు సంఘ్ సేవక్ లను ఎంపికచేసి వారిని తెలంగాణకు పంపనుందని తెలుస్తోంది. వీరంతా తమకు కేటాయించిన గ్రామాలు.. మండలాల్లో ఉంటూ అక్కడ పార్టీని బలోపేతం చేయడంతోపాటు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.

Also Read: నోటిఫికేషన్లు వచ్చేదాకా.. కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదా?

త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని సమాచారం. తెలంగాణ నుంచి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.

కేంద్రంలో తెలంగాణకు మరో మంత్రి పదవీ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిందనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈసారి పక్కాగా అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version