కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు..?

కరోనా విజృంభణ తరువాత కేంద్రం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులతో పాటు వ్యాపారులకు సైతం ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి. Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..? కేంద్ర ప్రభుత్వం 7వ […]

Written By: Navya, Updated On : December 16, 2020 1:57 pm
Follow us on

కరోనా విజృంభణ తరువాత కేంద్రం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులతో పాటు వ్యాపారులకు సైతం ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.

Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

కేంద్ర ప్రభుత్వం 7వ పే కమిషన్ చేసిన సూచనల ఆధారంగా ఉద్యోగుల వేతనాల పెంపు గురించి నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ 21 శాతం 17 శాతం వరకు తగ్గింది. పెన్షనర్లకు సైతం 21 శాతం నుంచి 17 శాతంకు తగ్గగా 2021 జూన్ నెల నుంచి డీఏ పెంపుతో పాటు ఉద్యోగుల వేతనాలు సైతం పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచడం వల్ల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో డీఏ శాతాన్ని తగ్గించిన కేంద్రం గత కొన్ని నెలల నుంచి బోనస్ ల ద్వారా, ఎల్టీసీ, ఎల్టీఏ వోచర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చేస్తోంది. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం డీఏ శాతాన్ని పెంచాలని యోచిస్తున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు డీఏ శాతాన్ని పెంచనున్నాయి.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

వేతనాల పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడంపై ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మోదీ సర్కార్ దేశంలో కరోనా వల్ల నష్టపోయిన అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే పలు ప్యాకేజీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.