Wakeup: ఉదయం నిద్రలేవడం కొందరికి చాలా కష్టమైన పని. నిద్ర లేచిన తరువాత కూడా అక్కడక్కడా కాసేపు కూర్చొని నిద్ర పోతుంటారు. కొందరైతే రాత్రిళ్లు వివిధ కారణాల వల్ల ఎక్కువ సేపు మేల్కోని ఉదయం చాలా ఆలస్యంగా కళ్లు తెరుస్తారు. ఇలా ఆలస్యంగా నిద్రలేచేవారిలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం, వ్యాపారం వెళ్లే వారికి సమయం ఎక్కవగా కావడంతో లేవగానే ఒత్తిడితో పనులు మొదలు పెడతారు. దీంతో రోజంతా వారు అన్నీ అపజయాలే ఎదుర్కొంటున్నారు. అయితే ఉదయం లేవగానే కొన్ని పనులు చేయడం వల్ల ఎలాంటి మానసిక సమస్యలు ఉండవు. పైగా ప్రతి సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించుకో గలుగుతారు. అ పనులేంటో తెలుసుకుందాం..
అద్దంలో మొహం చూసుకోవడం..
కొందరు ఉదయం లేవగానే అది చూశా.. ఇది చూశా.. ఈ రోజంతా బ్యాడ్ డే అని ఫీలవుతారు. ఇలా అటూ ఇటూ చూడడమెందుకు మీ మోహాన్నే అద్దంలో చూసుకోండి.. ఒకవేళ మంచి పనులు జరిగితే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చెడు జరిగినా కాలక్రమేణా ఇవి సహజం అని ఆలోచించాలి. ఇతరుల మొహం చూసి వారితో రిలేషన్ షిప్ కట్ చేసుకునే బదులు మీ ముఖాన్ని అద్దంలో చూడటం ఎంతో మంచిది.
కాసేపు శ్వాస వ్యాయామం..
నిద్ర లేవగానే చాలా మంది ఫోన్ చూడటం అలవాటు.. మరికొందరికి టీవీ చూడందే రోజు ప్రారంభం కాదు. ఇలా కళ్లపై ఒత్తిడి కలిగింగే పనులు ఏవీ పెట్టుకోవద్దు. మార్నింగ్ నిద్ర లేచిన తరువాత ముందుగా కాసేపు కళ్లు మూసుకొని శ్వాస వ్యాయామం చేయడం కనీసం 15 నిమిషాల పాటు ఊపిరిని పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉండి.. ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుంది.
అందమైన సంగీతం..
నిద్రలేవగానే కాస్త మజ్జుగా ఉంటుంది. ఇది తొలగిపోవాలంటే నచ్చిన సంగీతం వినాలి. ఇది టీవీ లేదా స్టీరియో ఎలాగైనా వినొచ్చు. ఇలా చేయడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో ఆ రోజంతా ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు. ఇక వ్యాయామం చేస్తూ సంగీతం వినడం వల్ల కూడా శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది.
ఇతరులతో మాట్లాడండి..
కొందరు ఇంటి పక్కనే ఉన్నా.. అసలు మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ ఉదయం లేవగానే ఇరుగు పొరుగువారిని మందలించండి. సందర్భం లేకపోయినా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఉదయం కబుర్లు వారితో షేర్ చేసుకోండి. ఇలా ఒకరి విషయాలు మరొకరు పంచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. పైగా రిలేషన్ షిప్ పెరుగుతుంది.
గంట ముందే లేవండి..
ప్రతిరోజూ నిద్ర లేచే సమయం కంటే ఒక గంట ముందు లేవండి. ఇలా లేచి కాస్త అటూ ఇటూ తిరగడం వల్ల వ్యాయామం చేసిన వారవుతారు. దీంతో టైం ఆదా అయి కార్యాలయాలకు సరైన సమయంలో వెళ్లగలుగుతారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయగలుగుతారు.