Mosquito : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఖర్చు లేకుండా ఇలా చేయండి..

దోమలు కుట్టకుండా వివిధ రసాయనాలు వాడుతూ ఉంటారు. కొందరు టర్టాయిస్ ను అంటిస్తారు. మరికొందరు లిక్విడ్ ఉపయోగిస్తారు. ఇవి వాడడం వల్ల కొత్త రకాల సమస్యలు వస్తాయి.

Written By: NARESH, Updated On : August 10, 2024 8:47 pm

Mosquitoes Bite Reason

Follow us on

Mosquito : వానాకాలం.. వ్యాధుల కాలం అని కూడా ఉంటారు. ఈ సీజన్ లో వాతావరణం కలుషితం కావడంతో అనేక వ్యాధులు సంభవిస్తాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్ తో చాలా మంది అవస్థలకు గురవుతాయి. డెంగ్యూ, మలేరియాలు దోమలు కుట్టడం వల్ల వస్తాయని అందరికీ తెలుసు. అనాఫిలిస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా, ఏడీఎస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ బారిన పడుతారు. అందువల్ల వర్షాకాలం ప్రారంభం కాగానే పరిశుభ్రత విషయంలో కేర్ తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఎటువంటి నీరు నిల్వ కుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. అలాగే చెట్లు ఎక్కవగా ఉన్నా.. దోమలు అధికంగా ఉంటాయి. అయితే దోమల నివారణకు టార్టాయిస్ వంటి వివిధ రసాయనాలు వాడుతూ ఉంటాం. కానీ వీటి వల్ల చిన్న పిల్లలు శ్వాస సమస్యలు ఎదుర్కొంటారు. ఇక మన చుట్టూ పక్కల వాళ్లలో కొంత మంది నాకు మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతున్నాయెందుకు? అని అంటారు. అయితే కొందరిని మాత్రమే ఎక్కువగా దోమలు కుడుతాయి. అలా కుట్టకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

దోమలు ఎక్కువగా కుట్టడానికి బ్లడ్ గ్రూప్ ఒక కారణం అవుతుంది. మిగతా వారి కంటే O గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్లు దోమలను ఆకర్షిస్తారు. అందుకే వారి బ్లడ్ తాగడానికి ఎక్కడున్నా వస్తుంటాయి. శరీరంలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్న వారిని దోమలు కుడుతూ ఉంటాయి. వీరిలో జీవ క్రియ వేగంగా ఉంటుంది. దీంతో శరీంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. దీంతో దోమలు ఎటు వైపు ఉన్నా వెంటనే ఇలాంటి వారిని పసిగట్టి వారిని కుడుతూ ఉంటాయి.

ఇలా కొన్ని బ్లడ్ గ్రూప్ ఉన్న వారితో పాటు మరికొందరిని దోమలు ఎక్కువగా కుడతూ ఉంటాయి. వీరిని దోమలు ఎక్కువగా కుట్టడానికి వారు ధరించిన దుస్తులే కారణం. దోమలు ఎక్కువగా ముదురు రంగు డ్రెస్ వేసుకున్న వారిని ఎక్కువగా లైక్ చేస్తాయి. లేత దుస్తులు ధరించి వారి వద్దకు వెళ్లవు. అలాగే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న వారిని ఎక్కువగా కుడుతూ ఉంటాయి. అలా ఎందుకంటే డెంగ్యూ వాధిని కలిగింగే ఏడీఎస్ దోమ చేతులను మాత్రమే కుడుతుంది. అంటే ఆఫ్ షర్ట్ లేదా టీషర్టు వేసుకున్న వాళ్లను ఇవి కుడుతూ ఉంటాయి. అలాగే మలేరియా వ్యాధినిన కలిగించే అనాఫిలిస్ దోమ కాళ్లను కుడుతూ ఉంటుంది.

దోమలు కుట్టకుండా వివిధ రసాయనాలు వాడుతూ ఉంటారు. కొందరు టర్టాయిస్ ను అంటిస్తారు. మరికొందరు లిక్విడ్ ఉపయోగిస్తారు. ఇవి వాడడం వల్ల కొత్త రకాల సమస్యలు వస్తాయి. అయితే రాత్రి పూట బయట తిరగాలనుకునేవారు పొట్టి డ్రెస్సులు కాకుండా కాళ్లు, చేతులు కవర్ అయ్యేలా దుస్తులు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఇలాంటివి జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే మలేరియా, డెంగ్యూ బారిన పడి ప్రాణాలైనా పోయే ప్రమాదం ఉంది.