https://oktelugu.com/

Success : ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే సక్సెస్ తో పాటు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు..

కష్టపడడం కాదు..కష్టపడి ఎదగడం కష్టమే. అందుకే ఏ పనిలో అయినా కష్టం కంటే ఇష్టంగా, తెలివిగా పనులు చేస్తేనే సక్సెస్ త్వరగా వస్తుంది. కాస్త కష్టానికి చాలా తెలివిని జోడించాలి.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 01:53 AM IST

    Chanakya Niti Success

    Follow us on

    happy life : ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. రిలేషన్, బాండింగ్, ఎంజాయ్ ఇలా చెప్పుకుంటూ ఏ ఒక్కటి కూడా ప్రతి సమయంలో ఒక మనిషితో ఎల్లప్పుడు ఉండవు. నీడ కూడా కొన్ని సార్లు కనిపించదు. అయితే చాలా విషయాలను మర్చిపోయి బతుకుతుంటారు ప్రజలు. కానీ వాస్తవంలో బతకడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా జీవించవచ్చు. కొన్ని నమ్మడానికి వాస్తవంగా అనిపించకపోయినా సరే వాటిని నమ్మాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ చాలా మంది చేసే తప్పులు.. వాటి వల్ల ఎదుర్కునే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    శాశ్వతం కాదు..
    ఎవరి లైఫ్ లో అయినా ఎలాంటి వస్తువు, రిలేషన్ లు కూడా శాశ్వతం కాదు. చనిపోయే ముందు దేన్ని వెంట తీసుకొని వెళ్లం అనేది గుర్తు పెట్టుకుంటే మనిషి ఆశా జీవితం నుంచి సంతోషకరమైన జీవితం గడపడం మొదలు పెడుతాడు. మన చుట్టూ జరిగే విషయాలు, మనుషులు ఇలా ఏదైనా సరే.. దూరం అవడం, మల్లీ రావడం కామన్ గా జరుగుతుంటాయి. సమస్య, సుఖ, కష్టం, నష్టం ఏది శాశ్వతం కాుద. దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తే మనిషి సంతోషంగా ఉంటారు.

    ఆధారపడడం.. సంతోషం మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే చాలా మంది ఇతరులలో తమ సంతోషాన్ని చూసుకుంటారు. అంటే సంతోషం కోసం ఇతరుల మీద డిపెండ్ అవుతారు. అయితే ఆనందంగా ఉండాలన్నా, బాధగా ఉండాలన్నా మీకు మీరే కారణం. పక్కవారిపై ఎక్కువగా డిపెండ్ అవకుండా..మీకు ఇష్టమైన పనులని చేస్తూ ఉంటే సక్సెస్ తో పాటు డెవలప్ అవుతుంటారు. సంతోషంగా ఉంటారు.

    కష్టపడడం కాదు..కష్టపడి ఎదగడం కష్టమే. అందుకే ఏ పనిలో అయినా కష్టం కంటే ఇష్టంగా, తెలివిగా పనులు చేస్తేనే సక్సెస్ త్వరగా వస్తుంది. కాస్త కష్టానికి చాలా తెలివిని జోడించాలి. దీని వల్ల పని భారం తగ్గి.. పనులు ఈజీగా అవుతుంటాయి. ఎలాంటి విషయంలో ఈ సూత్రం గుర్తుంచుకోవాలి.

    ఎక్స్‌పెక్టేషన్స్…ఏ విషయంలో అయినా సరే ఎక్కువ క్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు కొందరు. దీని వల్ల కచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అందుకే వాస్తవంలో జీవించాలి. ఫెయిల్యూర్స్‌ని అంగీకరిస్తూ.. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. అందరూ సంతోషంగానే ఉండాలి అనుకుంటారు కానీ సమస్యలు కామన్ గా వస్తుంటాయి. వాటిని యాక్సెప్ట్ చేస్తూ.. పాజిటీవ్ గా ముందుకు వెళ్లే విజయం మీదే అవుతుంది.

    ఎలాంటి విషయాలను ఎక్కువగా ఆలోచించాలి? ఎలాంటి విషయాలను స్కిప్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అయింది అనుకుంటున్నాం. అయినా సడన్ గా కొన్ని యాక్సెప్ట్ చేయడం కష్టమే. కానీ తప్పదండోయ్. దీని వల్ల మీరే కదా సంతోషంగా ఉండేది. కష్టమైన సరే అలవాటు చేసుకోండి. ఇతరులతో సంతోషం అనేది కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఎక్కువ సేపు ఈ సంతోషం నిలవదు. ఏదో ఒక రోజు వారితో సమస్య వచ్చినప్పుడు బాధ పడతారు. అందుకే మీ సంతోషాన్ని మీ పనుల్లో, మీ అలవాట్లలో వెతుక్కోండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి.