Summer Health Tips: వేసవిలో వేడి నుంచి రిలీఫ్ లభించాలంటే ఈ ఆసనాలు వేయండి..

వృక్షాసనం.. మీలో చాలా మందికి ఈ ఆసనం గురించి తెలిసే ఉంటుంది. సులభంగానే వేయవచ్చు కూడా. ఈ ఆసనం వేయడం వల్ల తొడలు, కాలు కండరాలు, ఏకాగ్రతను మెరుగు పరచడమే కాదు శరీరాన్ని సమతుల్యం చేయడంలో, విశ్రాంతిని ఇవ్వడంలో కూడా సహాయం చేస్తుంది.

Written By: Swathi, Updated On : May 4, 2024 6:38 pm

Summer Health Tips

Follow us on

Summer Health Tips: మండుతున్న ఎండలకు చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంటుంది. తాగడమే కాదు ఇంట్లో ఫ్యాన్లు సరిపోక, కూలర్లు, ఏసీలు మరీ తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండటంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి అంటే కూడా భయపడుతున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లబరచడం చాలా ముఖ్యం. దీనికి చలువ చేసే పదార్థాలు ఎంత ముఖ్యమూ.. యోగా ఆసనాలు వేయడం కూడా అంతే ముఖ్యం. మరి శరీరాన్ని చల్లబరిచే ఆ యోగాసనాలు ఏంటో ఓ సారి చూసేద్దాం..

వృక్షాసనం.. మీలో చాలా మందికి ఈ ఆసనం గురించి తెలిసే ఉంటుంది. సులభంగానే వేయవచ్చు కూడా. ఈ ఆసనం వేయడం వల్ల తొడలు, కాలు కండరాలు, ఏకాగ్రతను మెరుగు పరచడమే కాదు శరీరాన్ని సమతుల్యం చేయడంలో, విశ్రాంతిని ఇవ్వడంలో కూడా సహాయం చేస్తుంది.

మత్య్సాసనం.. శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించే ఆసనాల్లో ఈ ఆసనం ఒకటి. దీని వల్ల మెడ ధృఢంగా మారడం మాత్రమే కాదు శ్వాస తీసుకోవడంలో, విశ్రాంతిని ఇవ్వడంలో కూడా ఈ ఆసనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల బాడీ తొందరగా కూల్ అవుతుంది.

శవాసనం.. శవాసనంతో శరీరానికి రిలీఫ్ తో పాటు చల్లదనం కూడా అందుతుంది. ఈ ఆసనాన్ని ఎవరైనా వేయవచ్చు. ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

పద్మాసనం.. ఈ ఆసనాన్ని లోటస్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వల్ల శరీరానికి మేలుతో పాటు ఆరోగ్యం, శ్రేయస్సు రెండు పెంపొందుతాయి. శరీరం కూడా కూల్ అవుతుంది.

బుద్ద కోనాసనం.. దీన్ని బటర్ ఫ్లై ఫోజ్, సీతాకోక చిలుక భంగిమ అంటారు. ఈ ఆసనం వల్ల వెన్నెముక బలంగా మారడమే కాదు వెన్నెముక సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరం ఫిట్ గా అయ్యి చల్లగా మారుతుంది.