https://oktelugu.com/

GT vs RCB: గిల్ భయ్యా.. నువ్విలా మైదానంలో పులిహోర కలిపేస్తుంటే.. సచిన్ కూతురు పరిస్థితేంటి?

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా గుజరాత్, బెంగళూరు శనివారం రాత్రి తలపడనున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ సారథి గిల్ .. బెంగళూరు మైదానంలో ప్రాక్టీస్ సెషన్ లో తోటి ఆటగాళ్లతో కలిసి పాల్గొన్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 4, 2024 / 06:48 PM IST

    GT vs RCB

    Follow us on

    GT vs RCB: శుభ్ మన్ గిల్.. టీమిండియా యువ ఆటగాడు.. సంచలన ఆట తీరుతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. గత ఏడాది మన దేశం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఆడాడు. ఆ తర్వాత అనేక సిరీస్ లలో మెరిశాడు. ఆటతీరుతో మాత్రమే కాదు, సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో ఎఫైర్ ఉందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. వీటికి బలం చేకూర్చుతూ.. అప్పుడప్పుడు వీరిద్దరూ దొంగ చాటుగా రెస్టారెంట్లు, పబ్ లకు వెళ్తుంటారు. కెమెరాలకు చిక్కుతుంటారు. గిల్ ఆడే మ్యాచ్ లకు సారా కూడా హాజరవుతుంటుంది. ఇంతవరకు తమ బంధం పై సారా, గిల్ బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు గిల్ గతంలో ఆడిన మెరుగైన ఇన్నింగ్స్ ను మెచ్చుకుంటూ సచిన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం విధితమే. అయితే అటువంటి గిల్.. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో అడ్డంగా దొరికిపోయాడు.. ఆగండాంగండి. ఆ మైదానంలోకి సారా రాలేదు.. ఇంతకీ ఎవరు వచ్చారో.. గిల్ ఎవరితో పులిహోర ఎవరితో పులిహోర కలిపాడో.. మీరే చదివేయండి..

    ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా గుజరాత్, బెంగళూరు శనివారం రాత్రి తలపడనున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ సారథి గిల్ .. బెంగళూరు మైదానంలో ప్రాక్టీస్ సెషన్ లో తోటి ఆటగాళ్లతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్కడికి భారత మహిళల క్రికెట్ జట్టు క్రీడాకారిణి హర్లిన్ డియోల్ అక్కడికి వచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.. ఆమెకు బ్యాటింగ్ లో చిట్కాలను గిల్ వివరించాడు. వేగవంతమైన బంతులు ఎదురైతే ఎలా ఆడాలి? షార్ట్ పిచ్ బాల్స్ ను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై గిల్ హర్లిన్ కు సూచనలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బెంగళూరు జట్టుతో మ్యాచ్ కు ముందు గిల్, హర్లిన్ చాలాసేపు మాట్లాడుకోవడం చర్చకు దారి తీసింది. అయితే వీరిద్దరూ ఆటకు సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నారా, లేక వీరిద్దరి మధ్య ఏదైనా జరుగుతోందా? అనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. గిల్ మంచి ఆటగాడని కితాబిస్తున్నారు. అందమైన క్రీడాకారిణితో మైదానంలో పులిహోర బాగానే కలుపుతున్నాడంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక హర్లిన్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టులో ఆడింది. ఆల్ రౌండర్ గా ప్రతిభ చూపింది.

    ఇక ఈ ఐపిఎల్ సీజన్ లో గుజరాత్ జట్టు ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడింది. నాలుగు విజయాలు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. వరుస ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను కఠిన తరం చేసుకుంది. ఇక శనివారం రాత్రి బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో కనుక గుజరాత్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు గాలిలో కలిసిపోయినట్టే. గత సీజన్లో గుజరాత్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అంతకుముందు సీజన్లో విజేతగా ఆవిర్భవించింది.