Fever: సీజన్ మారిన ప్రతిసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా గాలిలో కొన్ని క్రిములు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ గాలిని పీల్చుకోవడం వల్ల మనుషులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీంతో జ్వరము జలుబు వంటి ఫ్లూ తో బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే కొందరు జ్వరం వచ్చినా కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇది మరింత తీవ్రమై ప్రాణాపాయస్థితికి చేరుకుంటుంది. అయితే వైద్యులు చెప్పిన ప్రకారంగా సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇదే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడే అనారోగ్యం నుంచి బయటపడతారు. అయితే జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో? ఇలాంటి ఆహారం తీసుకోకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర రావాలంటే ఈ ఐదు టిప్స్ పాటించండి..
జ్వరం వచ్చిన సమయంలో శరీరం అలసిపోతుంది. ఈ సమయంలో శరీరంలోని కొన్ని అవయాలు సక్రమంగా పనిచేయవు. ముఖ్యంగా జీర్ణశక్తి మందగిస్తుంది. అందువల్ల సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా ఫ్రూట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో కూడా నారింజ, ద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తం పరిశుభ్రమై జ్వరం వల్ల వచ్చే అలసట ఒత్తిడి ఆయాసం తగ్గుతుంది. అలాగే కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో జ్వరం ఉంటుంది. దీనిని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు మాత్రమే సహకరిస్తాయి. ఇందులో ఎలక్ట్రో లైట్లు, గ్లూకోస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే కూరగాయలను మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇది కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు.
అయితే జ్వరం వచ్చినప్పుడు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పాలు, పెరుగుతో పాటు వెన్న వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి న్యూ కాస్ ఉత్పత్తిని పెంచి శ్వాసకోస ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అలాగే జ్వరం వచ్చిన సందర్భంలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇవి నిద్రపో బంగాన్ని కలిగిస్తాయి. జ్వరం వచ్చినప్పుడు సరైన నిద్ర లేకపోతే ఆహారం తొందరగా జీర్ణం కాదు. అందువల్ల నిద్రకు భంగం కలిగించే టీ కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఇంకా ఈ సమయంలో మాంసాహారాలను అసలే ముట్టకూడదు. ఇవి తొందరగా జీర్ణం అయ్యే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్లు అధిక స్థాయిలో ఉండడంతో ఇవి శరీరానికి మేలు కు బదులు కీడును కలిగిస్తాయి.
ఇక ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవడంతో పాటు చాలా విశ్రాంతి తీసుకోవడం అవసరం. మొబైల్స్ లేదా టీవీలో చూడకుండా ఏదైనా బుక్ చదువుతూ ఉండాలి. అలాగే ఎవరితో అయితే సంతోషంగా ఉంటారో వారితో కలిసి ఉండాలి. ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కేర్ తీసుకోవడం వల్ల తొందరగా అనారోగ్యం నుంచి బయటపడతారు. ఇదే సమయంలో జ్వరం తీవ్రమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.