Summer Food : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు ముదిరాయి. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు కూడా మార్చుకోవడం తప్పనిసరి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడుతోంది. జీర్ణ సమస్యలు, ఉదర సంబంధ సమస్యలు వెంటాడు తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
పాలు, పాల పదార్థాలు
పాలు, పాల పదార్థాలు కలిపి తీసుకోవద్దు. దీని వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి. మొటిమలు, చర్మ సంబంధిత వ్యాధులు రావొచ్చు. అందుకే డైరీ ప్రొడక్టులు పండ్లు కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. పాలు, పెరుగు, జున్ను వంటివి కలిపి తినొద్దు. దీని వల్ల కూడా మనకు అనర్థాలు వస్తాయి. పొట్టపై భారం పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, ఫైనాపిల్ వంటి ఆమ్ల పండ్లు కలిపి తినకుండా ఉండాలి.
వేడి ఆహారాలు, కూల్ డ్రింక్స్
ఎండాకాలంలో వేడి ఆహారం తినే సమయంలో చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ తాగడం సరైంది కాదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో తిమ్మిరి, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో అన్నం తినే సమయంలో గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణం త్వరగా అవుతుంది. అందుకే చల్లటి వాటికి బదులు వేడివి తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.
పిండి పదార్థాలు
ఎండాకాలంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.దీని వల్ల కడుపుపై భారం పడుతుంది. జీర్ణ క్రియ త్వరగా జరగదు. బంగాళాదుంపల్లో పిండి పదార్థాలుఎక్కువగా ఉంటాయి. మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటిలో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే మనకు చెడు ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.
కొవ్వు, చక్కెర పదార్థాలు
కొవ్వు, చక్కెర పదార్థాలు కలిపి తీసుకోవద్దు. ఎండాకాలంలో ఎక్కువగా ఐస్ క్రీములు, కేకులు వంటివి ఎక్కువగా తింటాం. ఇంకా ఫ్రైడ్ లు తీసుకుంటాం. ఇందులో కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిని కలిపి తినడం వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.