Black magic in Jagityal: స్మార్ట్ కాలంలో నివసిస్తున్నాం. క్షణకాలంలో సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం. ప్రపంచాన్ని ఒక్క క్లిక్ దూరంలో చూస్తున్నాం. వర్షం ఎప్పుడు కురుస్తుంది? చలి ఎప్పుడు విపరీతంగా ఉంటుంది? ఎండ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఇలా ప్రతి అంశాన్ని జస్ట్ ఇట్టే తీసుకునే స్థాయిలో అభివృద్ధి సాధించాం. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ.. ఇంతటి స్థాయిలో గొప్పగా బతుకుతున్నప్పటికీ.. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఆ మూఢనమ్మకాలు ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మోతే గ్రామంలో ఈనెల 12న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు గ్రామంలో ఉన్న స్మశానవాటికలు అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటి రోజు పక్షికి వేయడానికి (తెలంగాణలో ఒక రకమైన సంప్రదాయం) కుటుంబ సభ్యులు వెళ్లారు. స్మశానంలో చూసిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడి ఆనవాళ్లు వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం కాస్త దావనం లాగా వ్యాపించడంతో ఆ జిల్లా మొత్తం కలకలం రేగింది.
స్మశానంలో ఆ యువతి మృతదేహం సగం మాత్రమే కాలింది. పైగా ఆ యువతి అస్థికలను కొంతమంది సేకరించారు. వాటి ద్వారా చేతబడి చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సగం కాలిన యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఆందోళన నిర్వహించారు. కొంతమంది మంత్రాలు చేయడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని.. ఇప్పటికైనా వారంతా మంత్రాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ ఊరేగింపు
జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో విచిత్ర ఘటన
ఈ నెల 12న పురుగుల మందు తాగి సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గ్రామ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
మరుసటి రోజు శ్మశానవాటికకు వెళ్లి చూడగా సగమే దహనమైన యువతి మృతదేహం
మళ్లీ… pic.twitter.com/k9raBKmRIR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025