
Sachin Tendulkar- Virender Sehwag: ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో సచిన్ గురించి తెలియని వారుండరు. క్లాస్ ప్లేయింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈయన ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. అలా ఆదర్శంగా తీసుకుని సచిన్ పక్కన ఆడే ఛాన్స్ కొట్టేశాడు సెహ్వాగ్. సచిన్, సెహ్వాగ్ ల ద్వయం ఎంతో ప్రత్యేకమైంది. వీరిద్దరు కలిసి ఓపెనర్లుగా చాలా మ్యాచులు ఆడారు. 2011 వరల్డ్ కప్ సమయంలో ఈ ద్వయం ఆట కూడా కప్ తేవడానికి సహకరించిందని చెప్పుకోవచ్చు. 2011 వరల్డ్ కప్ సమయంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సచిన్, సెహ్వాగ్ ల మధ్య ఓ సీన్ జరిగిందట. దీని గురించి ఇన్నాళ్లకు సెహ్వాగ్ బయటపెట్టాడు.
మైదానంలో దిగే ప్రతీ క్రికెటర్ ఎంతో ఒత్తిడిని భరించారు. ఓవైపు దేశాన్ని గెలిపించాలన్న కసితో పాటు ప్రత్యర్థిని ఎదుర్కోవాలన్న సంయమనం ఉండాలి. ఇలాంటి సమయంలో కాన్ఫిడెంట్ మిస్సయితే ఆటతీరులో తేడా వస్తుంది. అయితే ఓపెనర్ గా దిగే సెహ్వాన్ ఒత్తిడిని తట్టుకోవడానికి పాటలుపాడేవారట. అంతకుముందే ఆయన సాంగ్స్ పాడే హాబిట్ ఉంది. దీంతో ఒత్తిడికి గురైనప్పుడల్లా తనకు నచ్చిన పాట పాడి రిలాక్స్ అవుతాడట. చాలా సార్లు గ్రౌండ్ లో ఉన్నప్పుడు సెహ్వాగ్ పాటలు పాడుతూ కనిపించాడు.

2011 వరల్డ్ కప్ మ్యాచుల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఢీకొనే రోజు వచ్చింది. ఈ మ్యాచ్ కోసం సచిన్ తో పాటు సెహ్వాన్ మైదానంలోకి దిగారు. ఈ సమయంలో కాస్త ఒత్తిడికి గురి కాగానే సెహ్వాగ్ పాటలు పాడడం మొదలుపెట్టాడు. అలా మూడు ఓవర్లపాటు సెహ్వాగ్ పాటలతో గడిపాడు. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ ఆ సాంగ్స్ భరించలేకపోయాడట. దీంతో సెహ్వాగ్ వద్దకు వచ్చి అతనిని బ్యాట్ తో కొట్టాడట. నువ్విలాపాటలు పాడుతూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతుదని సచిన్ అన్నాడట. ఆ మధుర క్షణం ఎప్పటికీ గుర్తుండిపోయిందిన సెహ్వాన్ ఇప్పుడు బయటపెట్టాడు.
ఈ మ్యాచర్ లో సచిన్, సెహ్వాగ్ లు కలిసి 142 పరుగులు చేశారు. సెహ్వాగ్ 73 పరుగులు చేయగా.. సచిన్ 111 తో సెంచరీ కొట్టాడు. అయతే ఈ మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఫైనల్ గా ఈ సీరిస్ లో మనోళ్లు కప్ ను తీసుకొచ్చారు. మరో విశేషమేంటంటే వరల్డ్ కప్ మొత్తంలో ఈ మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం విశేషం. ఆ సందర్భంగా సెహ్వాగ్ తన మనుసులో ఉన్న విషయాన్ని బయటపెట్టడంతో క్రీడాభిమానులు ఆసక్తిగా చదువుతున్నారు.