https://oktelugu.com/

రాజవిక్రమార్క: బక్రీద్ కార్తికేయ సంచలన లుక్

టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఒక్కో హీరో మెల్లిగా సినిమాలు మొదలెట్టేస్తున్నాడు. కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా బక్రీద్ వేళ కూడా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు హీరో కార్తికేయ. ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో తన కొత్త చిత్రం పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశాడు. ‘రాజ విక్రమార్క’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం నుంచి కార్తికేయ లుక్ ను రిలీజ్ చేశారు. ‘రాజ విక్రమార్క’ చిత్ర బృందం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2021 / 03:30 PM IST
    Follow us on

    టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఒక్కో హీరో మెల్లిగా సినిమాలు మొదలెట్టేస్తున్నాడు. కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. తాజాగా బక్రీద్ వేళ కూడా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు హీరో కార్తికేయ.

    ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో తన కొత్త చిత్రం పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశాడు. ‘రాజ విక్రమార్క’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం నుంచి కార్తికేయ లుక్ ను రిలీజ్ చేశారు.

    ‘రాజ విక్రమార్క’ చిత్ర బృందం బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ సినిమాలోని ‘కార్తికేయ’కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘వ్యక్తి మనకు తెలిసినా.. మిషన్ మాత్రం తెలియదు’ అంటూ కామెంట్ చేసింది.

    ‘చావు కబురు చల్లగా’ మూవీ ఫ్లాప్ తర్వాత హీరో కార్తికేయ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన తరువాత సినిమాల పై ఇప్పుడు ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ మధ్యలో సుకుమార్ కార్తికేయతో అనౌన్స్ చేసిన సినిమా నిర్మిస్తాడా ? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోపక్క సుకుమార్ తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ, తన డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు చెపుతూ … సినిమా నిర్మాణాలు చేయాలని.. పెద్ద ప్లాన్ వేసుకున్నాడు.

    కనీసం తన ప్లాన్ కోసమైనా.. సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ సినిమా ఉంటుందా ? ఇప్పటికైతే ఈ సినిమా గురించి కార్తికేయకి ఎలాంటి అప్ డేట్ రాలేదట. పైగా తనే ఫోన్ చేస్తే.. కార్తికేయ ఫోన్ కి ఎవ్వరూ ఆన్సర్ కూడా చేయలేదు అట. అయితే సుకుమార్ మాత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే ‘ఉప్పెన’, ‘కుమారి 21 ఎఫ్’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సుక్కు, ఈ సారి కూడా సక్సెస్ అవ్వాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కానీ కార్తికేయతో మూవీ నిర్మిస్తాడా లేదా అన్నది చూడాలి. ఎదురుచూసి విసిగి వేసారి..  సుకుమార్ మూవీని పక్కనపెట్టి తాజాగా ‘రాజ విక్రమార్క’ అంటూ కొత్త సినిమాను కార్తికేయ అనౌన్స్ చేశాడు.