Effects of Alcohol: మద్యం సేవిస్తున్నారా.. ఆ సమయంలో పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినకూడదు!

Effects of Alcohol: సాధారణంగా కొందరు మందుబాబులకు ప్రతిరోజు చుక్క లేనిదే నిద్ర రాదు. ఈ క్రమంలోనే నిత్యం మద్యం మత్తులో గడుపుతుంటారు. ఇలా మద్యం సేవిస్తూ చాలా మందికి స్టఫ్ తినే అలవాటు ఉంటుంది. ఇలా మద్యం సేవిస్తూ ఎన్నో రకాల పదార్థాలను తింటూ ఉంటారు. అయితే మద్యం తాగుతూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా మద్యంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల పూర్తిగా ఆరోగ్యానికి ప్రమాదమని […]

Written By: Navya, Updated On : March 31, 2022 9:35 am
Follow us on

Effects of Alcohol: సాధారణంగా కొందరు మందుబాబులకు ప్రతిరోజు చుక్క లేనిదే నిద్ర రాదు. ఈ క్రమంలోనే నిత్యం మద్యం మత్తులో గడుపుతుంటారు. ఇలా మద్యం సేవిస్తూ చాలా మందికి స్టఫ్ తినే అలవాటు ఉంటుంది. ఇలా మద్యం సేవిస్తూ ఎన్నో రకాల పదార్థాలను తింటూ ఉంటారు. అయితే మద్యం తాగుతూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా మద్యంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల పూర్తిగా ఆరోగ్యానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకూడదు అనే విషయానికి వస్తే…

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?

Effects of Alcohol

చాలామంది మద్యం సేవించే టప్పుడు వేరుశెనగపప్పు లేదా జీడిపప్పును తినడానికి ఇష్టపడతారు. అయితే మద్యం సేవించే సమయంలో పూర్తిగా ఈ పదార్థాలను దూరం పెట్టాలి. మద్యంతో పాటు వీటిని తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండె పోటు వచ్చే సమస్య ఉంది. అదే విధంగా ఏ విధమైనటువంటి తీపి పదార్థాలను కూడా తినకూడదు. ఇక చాలామంది మద్యంతో పాటు సోడా లేదా కూల్ డ్రింక్ తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల కొన్నిసార్లు నియంత్రణ కోల్పోవలసి వస్తుంది.

మద్యంతో పాటు నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇలా నూనెతో తయారు చేసిన పదార్థాలను తినటం వల్ల గ్యాస్ అధికమయ్యే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాగే చిప్స్ కూడా తినకుండా ఉండడం ఎంతో ఉత్తమం. ఇక మద్యం సేవించేటప్పుడు చాలామంది పాలతో తయారుచేసిన పదార్థాలను తింటారు. ఈ విధంగా పాల ఉత్పత్తులతో తయారైన పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి అధిక అసిడిటీని కలిగిస్తుంది. దీంతో కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కనుక వీలైనంత వరకు మద్యం సేవించకుండా ఉండటమే ఉత్తమం.

Also Read: మద్యం తాగాక మన శరీరంలో అసలేం జరుగుతుంది..?