https://oktelugu.com/

Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?

Ghani Movie Non Theatrical Deal: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగింది. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీలో టాక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 08:06 AM IST
    Follow us on

    Ghani Movie Non Theatrical Deal: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగింది. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

    Ghani Movie Non Theatrical Deal

    ఇప్పటికే విడుదలైన గని టీజర్‌ కు చక్కని రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో నా పంచ్‌ పవర్‌ చూసి ఏదైనా నమ్మేయాల్సిందే అంటున్నాడు వరణ్‌. టీజర్‌ పవర్‌ ఫుల్‌ గా ఉంది. వరుణ్‌ పంచ్‌ కొడితే లారీ టైర్లు ఎగిరిపడే షాట్స్‌, కారు అమాంతం కదిలిపోయే షాట్స్‌ బాగున్నాయి. అన్నట్టు ఈ సినిమా నుంచి ఆ మధ్య షార్ట్ గ్లింప్స్ అనే పేరుతో చిన్నపాటి టీజర్ ను వదిలారు. అది కూడా చాలా బాగుంది.

    Also Read: Pakka Commercial Release Date Fixed: జులై 1న గోపీచంద్ నిలబడగలడా ?

    ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.

    అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు.

    Ghani Movie

    మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌ పై వస్తోన్న ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుందో చూడాలి.

    Also Read:NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే

    Tags