Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 33 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు 6 ఉండగా సీనియర్ ఇంజనీర్ పోస్టులు 27 ఉన్నాయి.

కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాలలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 2022 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీనాటికి 36 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. బీఈ/బీటెక్ సంబంధిత స్పెషలైజేషన్ లో పాస్ కావడంతో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి 17 లక్షల రూపాయల వేతనం లభించనుంది.
Also Read: Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?
32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే సీనియర్ ఇంజనీర్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్ విభాగాలతో పాటు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి 14 లక్షల రూపాయలు వేతనంగా లభించనుందని తెలుస్తోంది.
బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీలకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ బెంగళూరు అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. https://www.bel-india.in/ లింక్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజకీయాల కంటే హీరోయిన్లు ఎక్కువయ్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?