Amavasya: మన సనాతన ధర్మాలు మనకు అన్నీ నేర్పిస్తాయి. వాటిని మనం ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నాం. వాస్తు ధర్మాలు, మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నాం. ముఖ్యంగా అమావాస్య అంత్యక్రియలు చేయడం అరిష్టం అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆరోజు చనిపోయినా శవాన్ని ఆరోజు ఇంట్లోనే ఉంచి తెల్లవారు చేయాలని సూచిస్తారు. అమావాస్య రోజు దహనం చేస్తే వారి ఆత్మ శాంతించదని.. ఆత్మ పరలోకాలకు వెళ్లదని.. ఇక్కడే దెయ్యాలుగా ఉంటరాని ఒక మూఢ విశ్వాసం ఉంది.

అమావాస్య రోజు మృతిచెందిన బాలింతలను దహనం చేయకుండా అడ్డుకున్న సందర్భాలున్నాయి. ఒక కాలనీ వాసులు బాలింత అత్యక్రియలు చేయవద్దని హైదరాబాద్ తుర్కయాంజల్ లో అడ్డుకున్నారు. ఆమెను దహనం చేస్తే బస్తీకి అరిష్టమని వారంతా శవాన్ని ఇంటికి రాకుండా అడ్డుకున్నారు.
Also Read: Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్..!?.. ఎవరికి ఛాన్స్ అంటే?
దీంతో శవాన్ని చెరువు వద్దకు వెళ్లి అక్కడే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. అమావాస్య రోజు శవాలను కాల్చనీయకుండా ప్రజలు ఎలా అడ్డుకున్నారో ఈ ఉదాహరణ చాలు.
ఇక బయటకు వెళ్లేటప్పుడు శవం ఎదురొస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు. పండితులు కూడా శవం ఎదురొస్తే పనికి వెళ్లాలని.. ఆరోజు మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇక అంత్యక్రియలు చేసే వారికి ఇప్పటికీ చాలీచాలని పైకం ఇస్తున్నారని కాటికాపరులు అంటున్నారు. కట్టెలు కొట్టి తెచ్చేవారికి కనీస డబ్బులు ఇవ్వరని అంటున్నారు.
ఇక కాటికాపురుల వృత్తి అనేది ఒక్కరే చేసేవారని.. ఇప్పటికీ ఒక షెడ్యూల్ కులం వారే చేస్తారని.. ఇందుకోసం ఒక కుల వృత్తి ఉందని తెలిపారు.
తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అమావాస్య రోజు ఒక్కరోజు మధ్యాహ్నం నిద్రించవద్దని చెబుతున్నారు. ఇక అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం దరిద్రహేతువుగా చెబుతారు.
అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం.. జుట్టు కత్తిరించడం , గోళ్లు కత్తిరించడం చేయరాదంటారు. ఇక సాయంత్రం తలకు నూనె రాసుకోవడం మంచిది కాదంటారు.
Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
Recommended Videos



[…] Also Read: Amavasya: అమావాస్య రోజు అంతిక్రియలు అందుకే… […]