https://oktelugu.com/

Sajjala Ramakrishna- Vijayasai Reddy: వైసీపీలో పెరుగుతున్న సజ్జల గ్రాఫ్.. అట్టడుగున విజయసాయిరెడ్డి

Sajjala Ramakrishna- Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసిందా? ఆయనకు దాదాపు పక్కన పడేసినట్టేనా? పార్టీలో కనీస ఉనికి లేకుండా చేశారా? ఆయన స్థానాన్ని సజ్జల రామక్రిష్ణారెడ్డి భర్తీ చేసేశారా? భవిష్యత్ లో విజయసాయికి ఇబ్బందులు తప్పవా?.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు కూడా కష్టమేనంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను అధిష్టానం నియమించింది. […]

Written By:
  • Admin
  • , Updated On : April 20, 2022 / 08:04 AM IST
    Follow us on

    Sajjala Ramakrishna- Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసిందా? ఆయనకు దాదాపు పక్కన పడేసినట్టేనా? పార్టీలో కనీస ఉనికి లేకుండా చేశారా? ఆయన స్థానాన్ని సజ్జల రామక్రిష్ణారెడ్డి భర్తీ చేసేశారా? భవిష్యత్ లో విజయసాయికి ఇబ్బందులు తప్పవా?.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు కూడా కష్టమేనంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను అధిష్టానం నియమించింది. 26 జిల్లాలకు అధ్యక్షులతో పాటు రెండు, మూడు జిల్లాలకు ఒక సమన్వయకర్తను నియమించారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి ప్రాధాన్యమిచ్చారు. వారిలో కొందరి రీజనల్, మరికొందరికి జిల్లా పదవులిచ్చారు.

    Sajjala Ramakrishna- Vijayasai Reddy

    అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం విజయసాయిరెడ్డి ని పాతాళంలోకి తొక్కి పెట్టారు. సజ్జలకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఇన్నాళ్లూ నేను ఢిల్లీలో తోపు, జగన్ తరువాత స్థానం నాదేనంటూ విర్రవీగిన విజయసాయికి వీరలెవల్ లో పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్రపై పెత్తనం పోయింది. కనీసం చిన్నపాటి రిజియన్ బాధ్యతలు ఇవ్వలేదు సరికదా.. ఉనికి లేని పార్టీ అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం మిగిల్చారు. అయితే ఈ పదవికేమంత ప్రాధాన్యత ఉండదు. కేవలం సాక్షి మీడియాలో కనిపించే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. పాపం కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. విజయసాయిరెడ్డి పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి గ్రాఫ్ మాత్రం ఒక్కసారిగా పైకి పెరిగిపోయింది. పార్టీ మొత్తం బాధ్యతలను అధినేత జగన్ సజ్జల చేతిలో పెట్టశారని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మంత్రివర్గ కూర్పు నుంచి ఆశావహుల అలకల వరకూ బాధ్యతలన్నీ సజ్జలే చూడగా.. పార్టీ రిజియన్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీల అధ్యక్షుల జాబితా తయారీ, మీడియాకు కూడా సజ్జలే వెల్లడించారు. పార్టీలో పేరుకే అధినేత కానీ.. సజ్జల దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారన్న మాట.

    Also Read: BJP : టీఆర్ఎస్ దాష్టీకాలపై బీజేపీ సమరశంఖం

    గుంపగుత్తిగా పార్టీ పదవులు
    ఏదైనా పార్టీ పదవి లభిస్తే ఆనందంతో గంతేస్తారు. కానీ వైసీపీలో పార్టీ పదవులు లభించినా నేతల ముఖాల్లో ఆనందాలు కనిపించవు. మొన్నటి వరకూ బుగ్గ కారుల్లో మంత్రులుగా పదవులు వెలగబెట్టిన వారు పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించడం.. దానికి మంచి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం జగన్ కలరింగ్ ఇవ్వడాన్ని కూడా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీలో ఇప్పుడు పదవులు లేని వాళ్లెవరూ లేరు. అందరికీ ఓ పదవి పంచేశారు. పదవి పోయిన వాళ్లు..పదవి ఆశించిన వాళ్లు ఇలా ఎవర్నీ వదిలిపెట్టలేదు. అందరికీ ఓ పదవి ఇచ్చేశారు. వైసీపీ తరపున ఇరవై ఆరు మంది జిల్లాల అధ్యక్షుల్ని ప్రకటించారు. ఇందులో మంత్రి పదవులు పోగొట్టుకున్న వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

    Sajjala Ramakrishna- Vijayasai Reddy

    మాజీ మంత్రుల్లో కాస్త పట్టున్న వారికీ రీజనల్ కోఆర్డినేటర్ల పోస్టు ఇచ్చారు. కొడాలి నానికి రెండు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. చివరికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మరీ హ్యాండిచ్చిన మర్రి రాజశేఖర్ కు కూడా రెండు జిల్లాలు కట్టబెట్టేశారు. రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చేశారు. శాఖపరంగా అసంత్రుప్తితో ఉన్న బొత్స సత్యనారాయణను మెత్తబరచడానికి విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు అప్పగించారు. పార్టీ పదవుల్లో సజ్జలకూ అగ్రభాగం దక్కింది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆయన రీజనల్ కోఆర్డినేటర్. ఆయన పేరును ఆయనే ప్రకటించుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డికి దక్కిన ప్రాధాన్యం ఎవరికీ దక్కలేదు. కానీ ఉన్నపలంగా ఆయనను పక్కన పడేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధినేత ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయలేకపోయారా? లేక వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేసుకొని పార్టీని విస్మరించారా? దాని కారణంగానే విజయసాయిరెడ్డిని పక్కన పడేశారా? అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిశోర్ సర్వే కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

    Also Read:CM Kcr- Prashant Kishor: ‘పీకే’ అడుగులు.. కేసీఆర్ గుట్టు కాంగ్రెస్ చేతికి?

    Recommended Videos

     

    Tags