పెరుగుతున్న కాలుష్యం వల్ల, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు. ఆ సమస్యను అధిగమించడం కొరకు జుట్టుకు కలర్ వేస్తున్నారు. అయితే నిపుణులు ఎవరైతే జుట్టుకు కలర్ వేసుకుంటారో వాళ్లు కలర్ వేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొంతమందికి డై వేసుకున్న రెండుమూడు రోజులకే తెల్ల వెంట్రుకలు మళ్లీ కనిపిస్తూ ఉంటాయి.
కలర్ వేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా తప్పులు చేసినా జుట్టు రంగు మారే అవకాశం ఉంటుంది. డై ఎక్కువ రోజులు నిలవాలంటే కలర్ వేసుకున్న తరువాత రసాయనాలు ఎక్కువగా లేని షాంపూను వాడాలి. డై వేసుకున్న తరువాత రెగ్యులర్ షాంపూలనే వాడితే త్వరగా కలర్ పోయే అవకాశం ఉంటుంది. చాలామంది జుట్టుకు రంగు వేసుకున్న తరువాత వేడినీటితో స్నానం చేస్తుంటారు.
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కలర్ పోవడంతో పాటు జుట్టు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేడినీటికి బదులుగా గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకుంటే మంచిది. జుట్టుకు రంగు వేసుకున్న తరువాత చాలామంది హీట్ ప్రొటెక్టర్ ఉపయోగించకుండా టూల్స్ ను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రంగు మారే అవకాశం ఉంటుంది. హీట్ ప్రొటెక్టర్‌లో లభించే సిలికోసిస్, మాయిశ్చరైజింగ్ ఏజెంట్ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
అందువల్ల జుట్టుకు రంగు వేసుకునే వారు ఈ చిన్నచిన్న తప్పులు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కలర్ హెయిర్‌కి చాలాకాలం ఉండటంతో పాటు జుట్టుకు పదేపదే కలర్ వేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.