కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లు మారిపోయాయి. పోషకాహారం, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ల వల్ల పిల్లలకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోషకాహార నిపుణులు పిల్లలకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని అలాంటప్పుడు పిల్లలకు స్పెషల్ గా సిరప్ లేదా మల్టీ విటమిన్లను ఇవ్వడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పిల్లలు తినే అహారంలో పోషకాలు ఎంతలో ఉన్నాయో చూసుకోవాలని వేళకు ఆహారం తీసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు. వయస్సుకు తగిన విధంగా పిల్లలు ఉన్నారో లేదో గమనించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
మల్టీ విటమిన్లు పిల్లలకు ఇస్తే అవి విషంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు ఇవ్వాలని అలా కాకుండా విటమిన్ సప్లిమెంట్లు ఇస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సమచారం. కొంతమంది పిల్లలు వయస్సుకు తగిన విధంగా ఎదగకపోవడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి.
అలాంటి పిల్లలకు మాత్రమే మల్టీ విటమిన్లను వైద్యులు సిఫార్సు చేయడం జరుగుతుంది. పిల్లలకు వీలైనంత వరకు మల్టీవిటమిన్ల జోలికి వెళ్లొద్దని తగినంత పోషకాహారం అందేలా చూడాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తుండటం గమానార్హం.