https://oktelugu.com/

Cumin Benefits: జీలకర్రతో జీర్ణ సమస్యలు దూరం

శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వారు జీలకర్ర తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీలకర్రను రెండు గ్రాముల మోతాదులో 8 వారాలు తీసుకోవడం ద్వారా కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బుల ముప్పు కూడా ఉండదు. అధిక బరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా జీలకర్ర మనకు అన్ని విధాలుగా సాయపడుతుంది.

Written By: , Updated On : June 2, 2023 / 11:16 AM IST
Cumin Benefits

Cumin Benefits

Follow us on

Cumin Benefits: వంటల్లో జీలకర్రను వాడుకుంటాం. దీంతో వంటలకు ఎంతో రుచిగా ఉంటుంది. మన వంటింట్లో ఉండే పదార్థాల్లో ఇది ఒకటి. దీని వాసన కూడా భలే రుచిగా ఉంటుంది. అందుకే వంటలకు అంతటి రుచి కలుగుతుంది. జీలకర్రతో ఎన్నో లాభాలుంటాయి. జీలకర్రతో రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇందులో ఉండే థైమో క్వినన్ అనే రసాయన సమ్మేళనం కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. కొవ్వులను కరిగిస్తుంది. ఇలా జీలకర్రతో మనకు అనేక లాభాలున్నాయి.

శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వారు జీలకర్ర తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీలకర్రను రెండు గ్రాముల మోతాదులో 8 వారాలు తీసుకోవడం ద్వారా కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బుల ముప్పు కూడా ఉండదు. అధిక బరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా జీలకర్ర మనకు అన్ని విధాలుగా సాయపడుతుంది.

ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఇన్ని రకాల లాభాలుండటంతోనే దీన్ని వాడుతుంటాం. జీలకర్రను నీటిలో వేసి 3 నుంచి 4 గంటలు నానబెట్టాలి. తరువాత ఆ నీటిని మరిగించి వడకట్టుకోవాలి. ఈ నీటిని తాగడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది.

డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఔషధంగా పనిచేస్తుంది. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా సాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, మలినాలు తొలగిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా ఊబకాయంతో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇలా జీలకర్రతో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉండటంతోనే దీన్ని అందరు తీసుకుని రోగాలు లేకుండా చూసుకోవాలి.