హిందూధర్మంలో ఉపవాస దీక్షకు ఉండే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొంతమంది ఉపవాసం అంటే అన్నం తప్ప ఏమైనా తినవచ్చు అని భావిస్తే మరికొందరు మాత్రం పాలు, కొబ్బరినీరు వంటి రసాహారం తీసుకుంటారు. పెద్దలు పెట్టిన ఉపవాస నియమాలు పాటిస్తే శరీరంలోని వివిధ అవయవాల్లో ఆరోగ్యకరమైన మార్పులు కలుగుతాయి.
ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని మాలిన్యాలను సులభంగా బహిష్కరించడం సాధ్యమవుతుంది. ఉపవాసం చేయడం వల్ల కొన్ని వ్యాధులు సులభంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లను విసర్జించేలా చేయడంలో ఉపవాసం సహాయపడుతుంది. ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించేలా చేయడంలో ఉపవాసం సహాయపడుతుంది.
ఉపవాసం చేయడం వల్ల శ్వాసక్రియ చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఉపవాసం హృదయ స్పందనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉపవాసం వల్ల కాలేయానికి విశ్రాంతి కలగడంతో పాటు మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల తిమ్మిర్లు, మంటలు , నొప్పులను తగ్గించవచ్చు. నీరు, మాంసము, కీళ్లలో పేరుకుపోయిన కొవ్వును ఉపవాసం చేయడం వల్ల తొలగించవచ్చు.
ఉపవాసం చేయడం వల్ల చర్మవ్యాధులు తగ్గడంతో పాటు శరీరానికి చక్కటి రంగు వస్తుంది. ఉపవాసం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఉపవాసం వల్ల రక్తప్రసారం చురుకుగా జరగడంతో పాటు రక్తదోషములను సులువుగా నివారించవచ్చు.