Good Habits : మంచి అలవాట్లే మనల్ని విజయతీరాలకు చేరుస్తాయి తెలుసా?

Good Habits : మనం జీవితంలో ఎదిగేందుకు కొన్ని అలవాట్లు దోహదపడతాయి. మన అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తాయి. మన ఆలోచనలకు ప్రతిరూపాలే మన అలవాట్లు. మనం మంచి గుణాలు అలవర్చుకునే క్రమంలో మనకు ఎన్నో దారులున్నాయి. కానీ అవి సన్మార్గాలే అయితే మనకు నష్టాలు ఉండవు. కానీ మన అలవాట్లు బాగుంటే మనం ఉన్నత స్థాయికి చేరుకోవడం సహజమే. మంచి అలవాట్లతోనే మన మనుగడ సాఫీగా సాగుతుంది. అంతేకాని చెడ్డ దారుల్లో వెళితే మనకు నష్టాలే […]

Written By: Srinivas, Updated On : April 2, 2023 5:59 pm
Follow us on


Good Habits :
మనం జీవితంలో ఎదిగేందుకు కొన్ని అలవాట్లు దోహదపడతాయి. మన అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తాయి. మన ఆలోచనలకు ప్రతిరూపాలే మన అలవాట్లు. మనం మంచి గుణాలు అలవర్చుకునే క్రమంలో మనకు ఎన్నో దారులున్నాయి. కానీ అవి సన్మార్గాలే అయితే మనకు నష్టాలు ఉండవు. కానీ మన అలవాట్లు బాగుంటే మనం ఉన్నత స్థాయికి చేరుకోవడం సహజమే. మంచి అలవాట్లతోనే మన మనుగడ సాఫీగా సాగుతుంది. అంతేకాని చెడ్డ దారుల్లో వెళితే మనకు నష్టాలే ఉంటాయి.

ఉదయాన్నే నిద్ర లేవడం

తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్ర లేచే అలవాటు మంచిది. ఉదయం నిద్ర లేచే వారి ఆరోగ్యం బాగుంటుంది. వారి పనులు వారే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకా తొందరగా మన పనులు పూర్తయ్యేందుకు అనుకూ పరిస్థితులు చోటుచేసుకుంటాయి. దీంతో మనకు సమయం ఆదా అవుతుంది. మన కర్తవ్యం కోసం తొందరగా వెళ్లొచ్చు. త్వరగా కార్యాలయాలకు చేరుకోవచ్చు. దీంతో మనకు క్రమశిక్షణ అలవడుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇది ఓ మంచి అలవాటుగా మార్చుకోవడం తప్పనిసరి.

కలలు నిజం కావాలంటే..

కలలు నిజం చేసుకోవాలంటే అందుకు తగిన శ్రమ కూడా ఉండాలి. ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఆ దిశగా అడుగులు వేయాలి. అకుంఠిత దీక్ష, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. వేయి అడుగుల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. అలాగే ఎంతటి లక్ష్యమైనా సాధించేందుకు ముందుకు వస్తే దానికి అనుగుణంా చర్యలు తీసుకోవాలి. మనసులో బలమైన నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా మన కార్యాచరణ ఉండాలి. అప్పుడే మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

విజయం సిద్ధించే వరకు..

అల్పుడు ఏ పని మొదలు పెట్టడు. మధ్యముడు మొదలు పెట్టి మధ్యలోనే వదిలేస్తాడు. కానీ ఉత్తముడు పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తాడు. మనలో కూడా ఓ ఉత్తముడు ఉన్నాడని రుజువు చేయాలి. అందుకోసం మనం నిరంతరం శ్రమించాలి. విజయం మన ముంగిటకు వచ్చే వరకు విశ్రమించకూడదు. ఎవరో చెప్పినట్లు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందన్నట్లు మనలో సంకల్ప బలం బాగుంటే ఏదైనా సాధించవచ్చు. మోచేతిలో బలముంటే మొండి కొడవలైనా తెగుతుందని సామెత. ఇలా మనం చేపట్టే పని పూర్తి కావడానికి అహర్నిశలు శ్రమిస్తే మంచి ఫలితం రావడం ఖాయం.

ఇంకా ఏం చేయాలి?

లక్ష్యాల్ని చేధించడంలో నిష్ణాతులైన వారి జీవిత కథలు చదవాలి. వారి అనుభవాలు తీసుకోవాలి. మనకు అన్వయించుకుని మనం కూడా విజేతగా నిలవాలని నిర్ణయించుకోవాలి. దాని కోసం సమయపాలన పట్టిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా మన టైం టేబుల్ మార్చుకోవాలి. బద్ధకం మన నుంచి పారిపోవాలి. సమయం చక్కగా ప్లాన్ చేసుకుంటే ఏదైనా సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అలా మన జీవిత సాఫల్యతను సాధించుకునే క్రమంలో నిరంతరం శ్రమించే సత్తా కలిగి ఉండాలి. అందుకు బలమైన తిండి, వ్యాయామం కూడా తోడవుతాయి. ఇలా మన కలలు పండటానికి కావాల్సిన పరిస్థితులు మనమే సృష్టించుకోవడం మంచిది.