Diabetes: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ వ్యాధి ఒకటి. చాలామంది చక్కెర ఎక్కువగా తింటే షుగర్ వస్తుందని అనుకుంటారు. అయితే షుగర్ బారిన పడటానికి జెనెటిక్స్ నుంచి ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నా, హైబీపీతో బాధపడుతున్నా, ఎక్కువ సమయం కూర్చుని పని చేసినా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చక్కెర ఎక్కువగా తింటే మాత్రమే షుగర్ వస్తుందని భావించడం అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు స్టార్చ్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే.. చెక్ పెట్టే చిట్కాలివే?
డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు కేకు, బిస్కెట్, పకోడి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు పండ్లు తినవచ్చు. పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అయితే డయాబెటిస్ కండీషన్ ను బట్టి పళ్లను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మందులు వాడుతూ సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం సాధ్యమేనని చెప్పవచ్చు.
ప్రస్తుతం మార్కెట్ లో షుగర్ ఫ్రీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కచ్చితంగా మేలు జరుగుతుందని మాత్రం చెప్పలేము. బరువును అదుపులో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే డయాబెటిస్ సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?