https://oktelugu.com/

Pawan Kalyan: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ ప్రధాన శత్రువు ఎవరంటే… టక్కున చెప్పేయొచ్చు వైఎస్ జగన్ అని. వీరిద్దరి మధ్య రైవల్రీకి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. పవన్ పీఆర్పీ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ ను ఉద్దేశిస్తూ… పంచెలు ఊడదీసి కొడతాం.. అని పవన్ పబ్లిక్ మీటింగ్ లో సంచలన కామెంట్స్ చేశారు. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఆయన ప్రధాన ఎజెండా వైఎస్ జగన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 8, 2021 / 10:27 AM IST
    Follow us on

    Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ ప్రధాన శత్రువు ఎవరంటే… టక్కున చెప్పేయొచ్చు వైఎస్ జగన్ అని. వీరిద్దరి మధ్య రైవల్రీకి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. పవన్ పీఆర్పీ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ ను ఉద్దేశిస్తూ… పంచెలు ఊడదీసి కొడతాం.. అని పవన్ పబ్లిక్ మీటింగ్ లో సంచలన కామెంట్స్ చేశారు. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఆయన ప్రధాన ఎజెండా వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా సాగింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా జగన్ విజయావకాశాలను దెబ్బతీశారు.

    Pawan Kalyan

    జీవితంలో జగన్ సీఎం కాలేడు, కానివ్వను, ఇది శాసనం అంటూ పవన్ శబధం చేసిన విషయం తెలిసిందే. పాచిపోయిన లడ్లు ఇవ్వడం తప్పా.. ఏపీకి ఏం చేశావని మోడీపై గళమెత్తిన పవన్… 2019 ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీతో దోస్తీ కట్టడం వెనుక కారణం కూడా జగన్ సీఎం కావడమేనని చెప్పొచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిదైతే… జగన్ అసమర్థ వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ జారిపోతుందని విమర్శలు దాడికి దిగారు.

    ఇక సినిమా టికెట్స్ ధరలు, ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు వంటి సీఎం జగన్ నిర్ణయాలను పవన్ ఏ స్థాయిలో విమర్శించారో తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పవన్ స్పీచ్ మంట రేపింది. ఇదిలా ఉంటే రాయలసీమ వరద బాధితుల కోసం స్టార్ హీరోలు సాయం ప్రకటించారు. ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వరుసగా రూ. 25 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ఇవ్వడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది.

    Also Read: Actress Lahari: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…

    కాగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రకటించలేదు. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్థిక సహాయం చేయకపోయే ఆస్కారం కూడా కలదని కొందరు భావిస్తున్నారు. సీఎం జగన్ అంటే ఏమాత్రం ఇష్టం లేని పవన్ వరద సాయం విషయంలో స్పందించక పోవచ్చని కొందరి అభిప్రాయం. మరోవైపు జనసేన పార్టీ తరపున వరద ప్రభావిత ప్రాంతాల్లో కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

    కాబట్టి పవన్ ప్రత్యేకంగా వరద సాయం ప్రకటించాల్సి అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అయితే పవన్ ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ సీఎం సహాయనిధికి పంపుతారనే వాదన కూడా వినిపిస్తుంది. మరి చూడాలి వకీల్ సాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..

    Also Read: Jabardasth: షాకింగ్.. జబర్ధస్త్ కు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీం గుడ్ బై!

    Tags