షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ అన్నంతో అదుపులో షుగర్..!

ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ మంది షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ తో బాధ పడేవాళ్లు అన్నం తినాలంటే భయపడతారు. అన్నం తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువ సమయంలో పెరుగుతాయి. అయితే అన్నం తిన్నా కూడా శరీరంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. Also Read: వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు […]

Written By: Navya, Updated On : January 7, 2021 1:00 pm
Follow us on


ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ మంది షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ తో బాధ పడేవాళ్లు అన్నం తినాలంటే భయపడతారు. అన్నం తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువ సమయంలో పెరుగుతాయి. అయితే అన్నం తిన్నా కూడా శరీరంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

Also Read: వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు తెలుసా..?

శ్రీలంక దేశానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా అన్నంలో కేలరీలను సగానికి సగం తగ్గించే నూతన విధానాన్ని కనిపెట్టారు. అన్నం తిన్నా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలని భావించే వాళ్లు అరకప్పు బియ్యానికి మరిగే నీళ్లలో వంట కోసం వినియోగించే కొబ్బరి నూనెను వేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా అన్నంలోని పిండి పదార్థాల్లో కీలక మార్పులు జరుగుతాయి.

Also Read: డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?

సాధారణంగా అన్నం తిన్న వెంటనే త్వరగా జీర్ణమవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే కొబ్బరినూనెను వినియోగించడం వల్ల అన్నం త్వరగా జీర్ణమయ్యే లక్షణాన్ని కోల్పోతుంది. ఈ విధానం వల్ల పిండి పదార్థం పదిరెట్లు ఆలస్యంగా జీర్ణమవుతుంది. ఫలితంగా షుగర్ తో బాధ పడే వాళ్లు అన్నం తిన్నా షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచవచ్చు. మధుమేహ రోగులు ఈ విధానం ద్వారా సులభంగా షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నివారించవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

సంప్రదాయ వంట విధానంతో పోల్చి చూస్తే ఈ విధానం ద్వారా వంట చేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షుగర్ రాని వాళ్లు సైతం ఈ విధానంలో వండిన అన్నం తీసుకోవడం ద్వారా సులభంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.