https://oktelugu.com/

Work-life Balance : వర్క్, ఇంటి లైఫ్‌ను బ్యాలెన్స్ చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

మహిళలు అన్నింటిని ముందే ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని పాటిస్తే రెండింటిలో విజయం సాధించవచ్చు. ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే బాధ వచ్చిన కొందరు ఏడుస్తూ కూర్చొంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 27, 2024 4:40 pm
    Work- Life balance

    Work- Life balance

    Follow us on

    Work-life Balance : ఈరోజుల్లో చాలామంది ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఇంటి బాధ్యతలు, వర్క్ లైఫ్‌తో చాలా బిజీగా ఉంటున్నారు. కనీసం విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. దీంతో రెండింటిని బ్యాలెన్స్ చేయడం పెద్ద టాస్క్‌గా మారింది. విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పనిని కూడా సక్రమంగా చేయలేరు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అదే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా డబ్బు సంపాదించవచ్చు.. అలాగే ఇంటి లైఫ్‌ను మ్యానేజ్ చేస్తూ కుటుంబ సభ్యులను బాగా చూసుకోవచ్చు. మరి రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని చిట్కాలు ఉంటాయి. అవి పాటిస్తే ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. అవేంటో మరి ఈరోజు మన స్టోరీలో తెలుసుకుందాం.

    మహిళలు అన్నింటిని ముందే ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని పాటిస్తే రెండింటిలో విజయం సాధించవచ్చు. ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే బాధ వచ్చిన కొందరు ఏడుస్తూ కూర్చొంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏడవడం వల్ల కన్నీరు, సమయం వృథా కావడం తప్ప ఇంకేమి లేదు. కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా.. ధైర్యంగా ముందుకు పోవాలి. వ్యక్తిగత జీవితంతో పాట వృత్తిపరమైన జీవితాన్ని కూడా అదే ధైర్యంతో ముందుకు వెళ్లండి. ఖాళీ లేకుండా పనిచేస్తున్నట్లయితే.. పని మధ్యలో విశ్రాంతి అవసరం. వర్క్ చేస్తున్నప్పుడు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ సమయంలో మెడిటేషన్ చేయడం, వాకింగ్, నచ్చిన వాళ్లతో టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా రిలాక్స్ అవుతారు. వర్క్‌ను కూడా టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా చేస్తారు. మనస్సుకు ఏమైనా ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే మీకు నచ్చిన పని చేయండి. అప్పుడు అంతా సవ్యంగానే సాగుతుంది.

    వ్యక్తిగత విషయానికొస్తే.. ఇంట్లో అన్ని పనులు మీరే చేయాలనుకుంటే కుదరదు. కాబట్టి చిన్న చిన్న పనులు మీ భాగస్వామికి కూడా చెప్పండి. దీనివల్ల మీకు కాస్త సాయంగా ఉంటుంది. టైమ్ కూడా సేవ్ అవుతుంది. ఇద్దరూ సరదాగా కలిసి పనులు చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం కూడా బలపడుతుంది. అలాగే పార్ట్‌నర్‌తో టైమ్ స్పెండ్ చేశామని కూడా అనిపిస్తుంది. మీరు ఒక్కరే అని పనులు చేస్తే మీకు అలసటగా ఉంటుంది. అదే కలిసి మెలసి చేస్తే తొందరగా అవుతుంది. మీరు కూడా అంత ఒత్తిడికి గురి కారు. ఈ బిజీ లైఫ్‌లో కూడా మీకు మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి ఏదో ఒక సమయంలో చేస్తుండాలి. ఇంటి లైఫ్, వర్క్ లైఫ్, కుటుంబ బాధ్యతలను అన్నింటిని ఎలాంటి ఒత్తిడి లేకుండా మోయాలంటే ఇవి అయితే తప్పనిసరి.