రోజుకు మూడుపూటలా సమయానికి తిండి తినడం ఎంత ముఖ్యమో ఎనిమిది గంటలు నిద్ర కూడా అంతే అవసరం. ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. చాలామంది వేర్వేరు కారణాల వల్ల నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తూ ఉంటారు. నిద్ర లేకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధిస్తాయి.
Also Read: వంకాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఇవే ?
సరిగ్గా నిద్ర లేకపోతే మెదడు మరియు జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిద్రలేమి వల్ల కొన్ని సందర్భాల్లో మతిమరపు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నిద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. తక్కువ సమయం నిద్రపోయే వారిలో ఇమ్యూనిటీ పవర్ అంతకంతకూ తగ్గుతుంది. తక్కువ సమయం నిద్రపోయే వారిని వైరస్, బ్యాక్టీరియా వ్యాధులు వేధిస్తాయి.
Also Read: చలికాలం పెరుగు తినకూడదా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?
నిద్రలేమి వల్ల బాధ పడే వారు డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రపోని వారిలో గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావడంతో పాటు బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కంటి నిండా నిద్రపోవచ్చు. నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనం తీసుకోవాలి. నిద్రకు కనీసం గంట ముందు నుంచి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ కు దూరంగా ఉండాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
తక్కువ సమయం నిద్రపోయే వాళ్లకు డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. నిదరలేమి వల్ల కళ్ల కింద వలయాలు ఏర్పడటంతో పాటు చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నిద్రలేమి వల్ల కళ్లు తిరగడం, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి.