కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా వైరస్ విజృంభణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ మరింత ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కొత్త వైరస్ గురించి వార్తలు రావడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేస్తూ కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్తరకం వైరస్ కు వ్యాక్సిన్ పని చేస్తుందా..? లేదా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. అయితే రష్యా తమ దేశం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొత్తరకం కరోనా వైరస్ ను కూడా కట్టడి చేయగలదని తెలిపింది. స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ కొత్త రకం వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించగలదని వెల్లడించింది.
Also Read: మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..?
స్పుత్నిక్-వి కరోనా గతంలో కరోనా వైరస్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నా అద్భుతంగా పని చేసిందని రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ కిరిల్ డిమిట్రీవ్ తెలిపారు. కిరిల్ ఇతర వ్యాక్సిన్ సంస్థలతో కలిసి పని చేసి కొత్తరకం కరోనా వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజుల క్రితం స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రష్యా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను రిజిష్టర్ చేసింది. కరోనా వ్యాక్సిన్ ను రిజిష్టర్ చేసిన తొలి దేశంగా రష్యా గుర్తింపును సంపాదించుకుంది. ప్రజలకు త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారిని సులభంగా కట్టడి చేయడం సాధ్యమవుతుంది.