Effects of Toothpaste: ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా చేసే ప్రధాన విధి నోరు శుభ్రం చేసుకోవడం. దీనిలో భాగంగా బ్రష్ పై టూత్ పేస్ట్ పెట్టి పళ్ళు తోముతూ ఉంటారు. అయితే చాలామంది తమకు నచ్చిన విధంగా టూత్ పేస్ట్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. టూత్ పేస్ట్ టేస్టీగా ఉందా? లేదా? అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. మరికొందరు ఇది ఏ కంపెనీకి చెందినది? అని చూస్తారు. అయితే ఏ కంపెనీ అయినా ఇందులో ఎంత మోతాదులో రసాయనాలు వాడారో తెలుసుకోవాలి. మోతాదుకు మించితే పళ్ళు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అసలు టూత్ పేస్టులో ఉండే రసాయనాలు ఏంటి? ఏవి ఎక్కువగా ఉండకూడదు? టూత్ పేస్ట్ కొనేటప్పుడు ఏం చూడాలి?
సాధారణంగా రెండు లేదా మూడు కంపెనీలకు సంబంధించిన టూత్ పేస్టులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేసుకున్నా… కొందరి దంతాలు తొందరగా పాడైపోతాయి. అంతేకాకుండా నోటిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా రావడానికి టూత్ పేస్ట్ కంపెనీ అని అనుకుంటారు. వాస్తవానికి ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా ఎలాంటి రసాయనం వాడిందో తెలుసుకోవాలి. మనం వాడే ప్రతి టూత్ పేస్ట్ లో సోడియం లారైల్ సల్ఫేట్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఎక్కువగా నురుగు రావడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది టూత్ పేస్ట్ లో ఎంత వాడారో తెలుసుకోవాలి. దీనిని 0.5 నుంచి 2.0 శాతం వాడాలి. మోతాదుకు మించి వాడితే ఏ ఆహారం తీసుకున్నా.. చికాకు కలుగుతుంది. అలాగే నోరు టేస్టీ మారిపోతుంది. దీనితోపాటు టూత్ పేస్ట్ లో ట్రైక్లోసాన్ అనే రసాయనం వాడుతారు. ఇది కూడా మోతాదుకు మించి వాడితే శరీరంలో ఉండే హార్మోన్లను దెబ్బతీస్తాయి. క్లోరైడ్ కూడా ఎక్కువైనా విషంగానే మారుతుంది. పళ్ళు పాడవకుండా దీనిని వాడుతారు.ప్రోపిలిన్ guycall అనే రసాయనం కూడా టూత్ పేస్ట్ లో ఉంటుంది. ఇది మోతాదుకి మించితే నోటిలో ఎలర్జీ ఏర్పడుతుంది.
అందువల్ల టూత్ పేస్టును కొనుగోలు చేసేటప్పుడు ఏ కంపెనీది ? అని మాత్రమే కాకుండా టూత్ పేస్ట్ లేబుల్ పై ఏ రసాయనం ఎంత మోతాదులో వాడారో? కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు టూత్ పేస్ట్ టేస్టీ లేదా ఇతర విధాలుగా ఆకట్టుకునేందుకు రసాయనాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇది తాత్కాలికంగా బాగానే ఉన్నా.. దీర్ఘకాలికంగా పళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయం చేసే బ్రష్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే టూత్ పేస్ట్ సరైనదే అనిపించినా.. ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. లేకుంటే ప్రస్తుత కాలంలో ఉన్న ఆహార పదార్థాలు.. కలుషిత నీటితో పళ్ళు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.