Lucky zodiac signs: తెలుగు క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులను పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఆయా దేవుళ్ళకు పూజలు చేయడం వల్ల కొన్ని విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే పండుగలతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణమాసంలో ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే భాద్రపద మాసం విష్ణువుకు ఎంతో ప్రియమైనది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మహావిష్ణువు కు పూజలు చేయడం వల్ల కరుణిస్తాడని భావిస్తారు. ఇందులో భాగంగా ఈ మాసం ప్రారంభమైన 11వ రోజు పరివర్తిని ఏకాదశి వస్తుంది. పరివర్తిని ఏకాదశి రోజు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనున్నాయి. అయితే ఈ రాశులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల మరిన్ని విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
ఏకాదశి అంటేనే మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ పరివర్తిని ఏకాదశి రోజున పూజలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. ఈరోజు తులసి చెట్టుకు పూజలు చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు. అలాగే ఇంట్లో శాంతి, సామరస్యం ఏర్పడాలంటే ఈ రోజున శ్రీమహావిష్ణువుకు అనుగుణంగా ఉండే తులసి చెట్టుకు పూజలు చేసి విష్ణు సహస్రనామం చదివితే అనుకున్న పనులు జరుగుతాయని అంటారు. అయితే ఈ రోజున మూడు రాశుల వారు మాత్రం పూజలు చేయడం వల్ల అనేక విశేష ఫలితాలు జరిగే అవకాశం ఉంది.
పరివర్తిని ఏకాదశి వృశ్చిక రాశికి అనుకూలంగా ఉండనుంది. ఈ రాశి వారు గతంలో చేపట్టి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం చేసుకుంటారు. అలాగే వ్యాపారులకు ధన లాభం పెరుగుతుంది. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దీంతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో ఉండే వారికి వ్యక్తుల నుంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గి ప్రశంసలు ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయం కోసం చూసేవారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
కన్య రాశి వారికి పరివర్తిని ఏకాదశి రోజున శుభ ఫలితాలు జరగనున్నాయి. ఈరోజు వ్యాపారులు ఊహించిన దానికంటే లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే విజయవంతం అవుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొంది పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్తారు
మీన రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను తోటి వారి సహాయంతో పూర్తి చేస్తారు. అధికారుల నుంచి కూడా మద్దతు ఉండడంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడితే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.