Daily Yogurt Benefits: మనం ప్రతిరోజు ఇంట్లో తిని ఆహారంలోనే అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ ఆహారంపై కొన్ని అపోహలు ఉండడం వల్ల వాటిని దూరం చేసుకుంటూ ఉంటారు. వీటిని దూరం చేసుకుంటున్నామంటే పోషకాలను వదిలేస్తున్నామని అర్థం. అందువల్ల ఆహార పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకుని వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇలాంటి ఆహార పదార్థాలలో పెరుగు ఒకటి. చాలామంది పెరుగు తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ పెరుగులో ఉండే పోషకాల గురించి తెలిస్తే ప్రతిరోజు తప్పకుండా తింటారు. పెరుగు తినడం వల్ల పోషకాలు శరీరానికి లభించడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు
కొందరు చెబుతున్న ప్రకారం పెరుగు తినడం వల్ల దగ్గు, జలుబు వస్తుందని అపోహతో కలిగి ఉన్నారు. కానీ వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం సరైన సమయంలో సరైన విధంగా పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, విటమిన్ బి12, పొటాషియం, ప్రోబయాటిక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పటిష్టంగా కావడానికి ఉపయోగపడతాయి. అయితే పెరుగును సరైన సమయంలో సరైన విధంగా తీసుకోవాలి. అంటే తెలుగులో కేవలం మధ్యాహ్న భోజనం లో తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువగా వేసవిలో తీసుకోవాలి.. జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తము ఉన్నవారు పెరుగు తినవచ్చు. రాత్రి సమయంలో మాత్రం పెరుగు తినే ప్రయత్నం చేయవద్దని బైబిలు చెబుతున్నారు.
కొందరు చెబుతున్న ప్రకారం పెరుగు తినడం వల్ల దగ్గు, జలుబు వస్తుందా..? అంటే వైద్యులు చెబుతున్న ప్రకారం పెరుగు వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికారు. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని హానికర బాక్టీరియా పెరుగుదలను ఆపుతుంది. అయితే జలుబు ఉన్నవారు.. గొంతులో సమస్యలు ఉన్నవారు పెరుగు తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు. ఇంకోదరు చెబుతున్న ప్రకారం పాలకంటే పెరుగు మంచిదేనా అని.. వాస్తవానికి పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ పెరుగు తొందరగా జీర్ణమై శరీరానికి శక్తిని అందిస్తుంది. ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. బద్ధక సమస్యల నుంచి బయటపడతారు.
ఇక పెరుగును మార్కెట్లో కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. ఇలా తయారుచేసిన పెరుగులో జీవ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ పదార్థాలు ఉండవు.