https://oktelugu.com/

COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు మరో షాకింగ్ న్యూస్!

COVID-19 Vaccination: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మరి కొందరు ఒక డోసు వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. యుఎస్ హెల్త్ ఏజెన్సీ సిడిసి కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు కరోనా సోకే ఛాన్స్ 29 శాతం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2021 / 06:56 PM IST
    Follow us on

    COVID-19 Vaccination: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే మరి కొందరు ఒక డోసు వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. యుఎస్ హెల్త్ ఏజెన్సీ సిడిసి కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు కరోనా సోకే ఛాన్స్ 29 శాతం ఎక్కువని తేలింది.

    డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ మరింత ముఖ్యమని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 43,127 మంది రోగులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా ప్రమాదాలు, పరిణామాలను తేలికగా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

    మన దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో 96 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేలింది. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందే అవకాశాలు ఉంటాయి. కరోనా థర్డ్ వేవ్ కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ను త్వరగా వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వ్యాక్సిన్ లభ్యమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవాలని భావించే వాళ్లు ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా పొందవచ్చు. శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో ముఖ్యమని అర్థమవుతోంది.