https://oktelugu.com/

RS Praveen Kumar : వెలమ, కమ్మ, రెడ్డి.. ఆర్ఎస్ ప్రవీణ్ టార్గెట్ అదేనా?

RS Praveen Kumar : హుజురాబాద్ (Huzurabad) ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పేరిట దళితులకు వల వేసే కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  సీఎం కేసీఆర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో  ఇక్కడ రాజకీయం రోజురోజుకు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావించినా ప్రస్తుతం బీఎస్పీ కూడా పోటీలో ఉంటుందని వార్తలు వస్తున్నందున అధికార పార్టీ ఆలోచనలో పడిపోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 26, 2021 / 07:04 PM IST
    Follow us on

    RS Praveen Kumar : హుజురాబాద్ (Huzurabad) ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పేరిట దళితులకు వల వేసే కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  సీఎం కేసీఆర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో  ఇక్కడ రాజకీయం రోజురోజుకు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావించినా ప్రస్తుతం బీఎస్పీ కూడా పోటీలో ఉంటుందని వార్తలు వస్తున్నందున అధికార పార్టీ ఆలోచనలో పడిపోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar ) హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న తరుణంలో అధికార పార్టీలో భయం పట్టుకుంది.

    హుజురాబాద్ లో విజయం కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే దళితుల ఓట్లు ఆయనకే పడే సూచనలు కనిపిస్తున్నాయి. దళిత అధికారిగా ఆయనకు అనుచరులు ఎక్కువగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ఈటలను ఓడించాలని భావిస్తున్నా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వస్తే ఎలాగని మీమాంసల పడిపోయారు.బీఎస్పీ బరిలో నిలిస్తే పరిస్థితి ఎలాగని భయాందోళన నెలకొంది.

    ఇప్పటికే ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో బీఎస్పీ తరఫున పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన నెలకొంది. హుజురాబాద్ లో పోటీ చేయాలా? వద్దా? అనే కోణంలో ప్రవీణ్ కుమార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పలువురి నుంచి వస్తున్న ఒత్తిడితో పోటీకి అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నల్లగొండ, వరంగగల్ లో జరిగిన సభల్లో ప్రవీణ్ కుమార్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం ఖాయమనే దీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఒక వేళ బీఎస్పీ తరఫున పోటీ చేస్తే అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ లేకపోయినా పోటీలో ఉన్న అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రదానంగా అధికార పక్షం టీఆర్ఎస్ నే లక్ష్యంగా చేసుకుని ప్రవీణ్ కుమార్ ప్రచారం చేయడం సాధారణమే. దీంతో టీఆర్ఎస్ లో వణుకు పుడుతోంది. ప్రవీణ్ కుమార్ భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ప్రవీణ్ కుమార్ ఫోబియా పట్టుకుంది.

    ఇటీవల దళిత అధికారులకు కేసీఆర్ సర్కార్ కీలక పదవులు ఇవ్వడం లేదని.. సీఎంవో లేరన్న విమర్శల నేపథ్యంలోనే సీఎంవోలోకి ‘రాహుల్ బొజ్జా’ను కేసీఆర్ సర్కార్ నియమించింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ కూడా దళిత సామాజికవర్గం కావడంతో విమర్శలకు జడిసే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. దళిత అధికారులు అన్న మాటే తప్పు అని.. వెలమ, రెడ్డి, కమ్మ , బ్రాహ్మణ అధికారి అని ఎవరైనా అంటారా? అని నిలదీశారు. తాము టాలెంట్ తో ఆపొజిషన్లోకి వచ్చామని.. కులం పేరుతో గుర్తించడం అవమానమన్నారు. ఎవరూ దళితులకు బిచ్చం వేయడం లేదని.. అది మా టాలెంట్ తో వచ్చిన గుర్తింపు అని స్పష్టం చేశారు.