Income Tax Returns: మన దేశంలోని ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా సులభంగా రుణాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడనికి సెప్టెంబర్ 30వ తేదీ చివరితేదీగా ఉంది. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మూలధన లాభాల గురించి సమాచారం ఇవ్వాలి.
ఆస్తి లేదా బంగారం విక్రయించిన సమయంలో మూలధన లాభాలపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లించని పక్షంలో అధికారులు పన్ను ఎగవేతగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల లోపు బంగారాన్ని విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణించి ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్నును విధించడం జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత బంగారంను విక్రయిస్తే దానిని మూలధన లాభంగా పరిగణించి 20.8% పన్ను విధిస్తారు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లపై కూడా భౌతిక బంగారంతో సమానంగా పన్ను విధించడం జరుగుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ సమయం 8 సంవత్సరాలు కాగా దీనిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాలి. ఆస్తి కొనుగోలు చేసిన 2 సంవత్సరాల్లో విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభంగా ఆ ఆస్తిని పరిగణిస్తారు. కొనుగోలు చేసిన 2 సంవత్సరాల తర్వాత ఆస్తి విక్రయిస్తే 20.8 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
నివాస గృహ ఆస్తిపై కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పెట్టుబడికి వచ్చే మూలధన లాభం నుంచి చెల్లించల్సిన పన్నును క్యాపిటల్ గెయిన్ గా పరిగణించడం జరుగుతుంది.