కరోనా సెకండ్ వేవ్ టైంలో తినకూడని ఆహార పదార్థాలివే..?

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చేస్తున్న చిన్నచిన్న పొరపాట్ల వల్ల ప్రజల్లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ సరైన ఆహరం తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో బలవర్ధక ఆహారంతో పాటు ఇమ్యూనిటీ […]

Written By: Navya, Updated On : April 23, 2021 3:02 pm
Follow us on

దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చేస్తున్న చిన్నచిన్న పొరపాట్ల వల్ల ప్రజల్లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ సరైన ఆహరం తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో బలవర్ధక ఆహారంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది. అదే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంది. తేనె, దేశీ నెయ్యి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐతే కల్తీ లేని తేనెను, దేశీ నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. శరీరం డైహైడ్రేషన్ కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జంక్ ఫుడ్ కు కరోనా సమయంలో వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. రాజ్మా, ధాన్యం, పప్పు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే సగం ఉడికిన గుడ్లను మాత్రం అస్సలు తీసుకోకూడదు. అప్పుడప్పుడూ చికెన్ తీసుకోవడంతో పాటు పూర్తిగా ఉడకబెట్టిన గుడ్లను మాత్రమే తినాలి.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది