Corona Diet: దేశంలో గత కొన్నిరోజులుగా ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
కరోనా సోకిన వాళ్లు ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఎక్కువమొత్తంలో ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చేటు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆల్కహాల్ శరీరానికి హానికరం అనే సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బలహీనపడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్కహాల్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
ఫైబర్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఫైబర్ ఆకలిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. తగినంత నీరు త్రాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు 10 గ్లాసుల కంటే ఎక్కువ నీటితో పాటు నిమ్మరసం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
ఇంట్లో వండిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లో వండిన అహారం పోషకాలను కలిగి ఉండటంతో పాటు రుచికరంగా ఉంటుంది. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల అనేక దేశాల్లో ఆంక్షలు అమలవుతుండటం గమనార్హం.