https://oktelugu.com/

కరోనా కలిపింది ఇద్దరినీ.. లైఫ్ మరింత రొమాంటిక్!

కరోనా.. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడం అనే ఒక్క విషయాన్ని పక్కన పెడితే.. ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు నేర్పింది. పని ఆఫీసుల్లోనే చేయాల్సిన పనిలేదని చెప్పింది. ప్రకృతి రక్షణే మనిషి రక్షణ చాటింది. అంతే కాదు.. బలవంతంగా మనుషులను ఇంట్లోనే ఉంచింది, ప్రేమగా మనుసులు కలుసుకునేలా కూడా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదో పెద్ద పరిణామం. Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ ఐదు గ్రూపుల వారికే కరోనా ముప్పు..? టైం ఉండేదే కాదు.. కరోనాకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 04:37 PM IST
    Follow us on


    కరోనా.. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడం అనే ఒక్క విషయాన్ని పక్కన పెడితే.. ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు నేర్పింది. పని ఆఫీసుల్లోనే చేయాల్సిన పనిలేదని చెప్పింది. ప్రకృతి రక్షణే మనిషి రక్షణ చాటింది. అంతే కాదు.. బలవంతంగా మనుషులను ఇంట్లోనే ఉంచింది, ప్రేమగా మనుసులు కలుసుకునేలా కూడా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదో పెద్ద పరిణామం.

    Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ ఐదు గ్రూపుల వారికే కరోనా ముప్పు..?

    టైం ఉండేదే కాదు..
    కరోనాకు ముందు.. ఆ తర్వాత అని ప్రపంచాన్ని విభజించి చూడొచ్చు. అప్పట్లో ఉద్యోగులు ఇంట్లో వాళ్లకు సమయం కేటాయించలేకపోయేవాళ్లు. మనసులో కోరిక ఉన్నా.. పరిస్థితులు అవకాశం ఇచ్చేవి కావు. పిల్లలు ఉన్న కుటుంబాల సంగతి అటుంచితే.. నూతన దంపతులు ఎడబాటును దిగమింగుతూ కాలం గదిపేవారు. కానీ.. కరోనా రాకతో మొదలైన లాక్ డౌన్ వల్ల జంటలకు కావాల్సినంత సమయం దొరికింది. ఇది చాలా మందికి ఆనందాన్ని ఇచ్చింది. ఇది మేం చెబుతున్న మాట కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు శోధించి సాధించిన రిపోర్టు!

    కలిసిన మనసులు..
    లాక్ డౌన్ కు కొంచెం ముందు పెళ్లి చేసుకున్న వారు.. లేదా లివింగ్ రిలేష‌న్ షిప్ ను మొద‌లుపెట్టిన వారు, లాక్ డౌన్ కాలంలోనే కొత్త బంధంలోకి అడుగిడిన వారు.. ఇలాంటి వారంతా ఇంటికే ప‌రిమితమైన ఈ కాలాన్ని చాలా బాగా ఉప‌యోగించుకుంటున్నార‌ని అధ్య‌య‌నాల సారాంశం. ఇద్ద‌రూ రోజంతా ఇంట్లోనే గ‌డ‌ప‌డం, ఆఫీసుకు వెళ్లే అవ‌స‌రం లేక‌పోవ‌డం వ‌ల్ల ఒక‌రినొకరు మ‌రింతగా అర్థం చేసుకునేందుకు స‌మ‌యం దొరికింద‌ని తెలుస్తోంది.

    Also Read: భారత్ లో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే..?

    చైనాలో మాత్రం..
    చైనా లో మాత్రం లాక్ డౌన్ వల్ల ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండి గొడవలు పడుతూ విడాకుల వరకూ వెళ్లినవారు ఎక్కువగానే ఉన్నారట! ఆ దేశం సంగతి ఏమోగానీ.. ఇండియాతో స‌హా ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో క‌రోనా లాక్ డౌన్.. దాంపత్య జీవితాన్ని మరింత రొమాంటిక్ గా మార్చిందనే అభిప్రాయమే వ్యక్తమైంది అంటున్నాయి అధ్య‌య‌నాలు. కొత్త జంటలు బాగా ఎంజాయ్ చేస్తుంటే.. పాత దంపతులు కుటుంబంతో గడుపుతూ ఆనందిస్తున్నారు.