https://oktelugu.com/

‘బెల్‌ బాటమ్‌’ సినిమా ఎలా ఉంది అంటే.. ?

కన్నడ బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైన చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఈ డిటెక్టివ్‌కు ఏ సమస్య ఎదురైంది? ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో ఈ డిటెక్టివ్‌ ఎలా నవ్వించాడు అనేది చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే.. వివిధ ప్రాంతాల్లో ఒంటిరిగా ఉన్న వారిని ఓ దొంగల గ్యాంగ్‌ దోచుకుంటూ ఉంటుంది. హేమగిరి పోలీసులు ఆ ముఠాను పట్టుకుని […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 04:46 PM IST
    Follow us on


    కన్నడ బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైన చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఈ డిటెక్టివ్‌కు ఏ సమస్య ఎదురైంది? ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో ఈ డిటెక్టివ్‌ ఎలా నవ్వించాడు అనేది చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే.. వివిధ ప్రాంతాల్లో ఒంటిరిగా ఉన్న వారిని ఓ దొంగల గ్యాంగ్‌ దోచుకుంటూ ఉంటుంది. హేమగిరి పోలీసులు ఆ ముఠాను పట్టుకుని భారీ మొత్తంలో డబ్బు, నగలు స్వాధీనం చేసుకుంటారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ మొత్తాన్ని స్టేషన్‌లోని ఓ లాకర్‌లో పెడతారు. ఉదయం ఆ డబ్బును కోర్టులో సబ్‌మిట్ చేయడానికి లాకర్‌ ఓపెన్‌ చేయగా, అది ఖాళీగా ఉంటుంది. ఇంతకీ ఆ డబ్బును ఎవరు కాజేశారు ?

    Also Read: ఏడిస్తే ఓట్లు వేస్తారా..? డ్రామాలు చేస్తే ఆదరిస్తారా..?

    అలాగే కొన్ని రోజుల తర్వాత పుష్పగిరి పోలీస్‌ స్టేషన్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటుంది. మరి స్టేషన్ లో డబ్బు ఎలా మాయం అవుతుంది ? మరోవైపు డిటెక్టివ్‌ దివాకర్‌(రిషబ్‌ శెట్టి)కి చిన్నప్పటి నుంచి జేమ్స్‌ బాండ్‌ కథలు, డిటెక్టివ్‌ నవలలంటే ఎంతో ఇష్టం చూపిస్తుంటాడు. ఆ సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ ఎప్పటికైనా పెద్ద డిటెక్టివ్‌ అవ్వాలని కలలు కంటాడు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల స్టేషన్‌లో సెంట్రీగా జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో ఓ కేసును తన తెలివి తేటలతో చాకచక్యంగా పరిష్కరించడంతో పోలీస్‌స్టేషన్‌లో పోయిన నగదు కేసును దివాకర్‌కు అప్పగిస్తారు. మరి దివాకర్‌ ఆ కేసును ఎలా పరిష్కరించాడు? అనేదే మెయిన్ కథ.

    Also Read: అమ్మాయి మోసం చేసింది.. బెస్ట్ కమెడియన్ అయిపోయాడు !

    కాగా డిటెక్టివ్‌, జేమ్స్‌బాండ్‌ కథలతో ఎన్నో సినిమాలు వచ్చినా.. సినిమా బాగుంటే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఒక్కో చిక్కుముడిని విప్పుకొంటూ వెళ్లడం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. ఈ సినిమా ఉత్కంఠగా సాగుతూ, ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చొబెట్టేలా సాగడంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. దీనికితోడు ‘బెల్‌బాటమ్‌’లో కామెడీగా పుష్కలంగా ఉంది. పైగా ఈ కథకు మరో అడ్వాంటేజ్‌ ఏంటంటే కథ, కథనాల్లో ఎక్కడా ఇంట్రస్ట్ తగ్గదు. దర్శకుడు రెట్రో థీమ్‌ను కథ అంతా 80వ దశకంలో జరిగినట్లు చూపించాడు. మొదటి సన్నివేశంలోనే అసలు కథేంటో చెప్పేశాక దర్శకుడు సినిమాని తెలివిగా నడిపాడు. ఖాళీగా ఉంటే.. సరదాగా ఆహాలో ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్