ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ ఐదు గ్రూపుల వారికే కరోనా ముప్పు..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తొంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రపంచ దేశాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు వైరస్ గురించి పరిశోధనలు కొనసాగిస్తుండగా పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు వ్యాక్సిన్లు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని అధికారుల అనుమతుల కొరకు ఎదురు చూస్తున్నాయి. Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా..? అయితే వ్యాక్సిన్ […]

Written By: Navya, Updated On : December 12, 2020 11:05 am
Follow us on


ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తొంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రపంచ దేశాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు వైరస్ గురించి పరిశోధనలు కొనసాగిస్తుండగా పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు వ్యాక్సిన్లు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని అధికారుల అనుమతుల కొరకు ఎదురు చూస్తున్నాయి.

Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా..?

అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండటంతో వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక సంస్థ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఎవరిపై ఉందో తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: మద్యం తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ తీసుకుంటే తాగకూడదట..?

ఈ సంస్థ అధ్యయనం ద్వారా అందరిలో కరోనా వైరస్ తీవ్రత ఒకే విధంగా లేదని.. కొందరిలో వైరస్ తీవ్రత చేయి దాటిపోతుందని తేలిందని తెలిపారు. మన శరీరంలోని జీన్స్ కు కరోనాకు సంబంధం ఉందని.. ఐదు వర్గాలకు చెందిన జీన్స్ ఉన్నవారికి కరోనా సోకితే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని సంస్థ అధ్యయనంలో తేలింది. ఆ ఐదు గ్రూపుల వారికి.. కరోనా ముప్పు చాలా ఎక్కువని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

ఓఏఎస్1, డీపీపీ9, సీసీఆర్2, ఐఎఫ్ఎణ్ఏఆర్2, టీవైకే2 గ్రూపుల జీన్స్ కలిగి ఉన్నవారు కరోనా బారిన పడితే వాళ్ల ప్రాణాలకే ముప్పు ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రముఖ మెడికల్ జర్నల్ నేచర్‌ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురించబడ్డాయి. అధయనం చేసిన శాస్త్రవేత్తలు ఫైజర్ వ్యాక్సిన్ కంటే బామ్మానివిమాబ్ అనే డ్రగ్ కరోనా సోకకుండా ప్రభావవంతంగా పని చేస్తుందని వెల్లడించారు.