దేశంలో ఎన్నో ఆహార ధాన్యాలు ఉన్నా ప్రజలు జొన్నలు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తారు. పీచు పదార్థాలు అధికంగా ఉండే జొన్నలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. గోధుమలు, మొక్కజొన్న, బియ్యం తరువాత జొన్నలను రైతులు ఎక్కువగా పండిస్తారు. వైద్య నిపుణులు ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నలు తినడం మంచిదని రోజూ జొన్నరొట్టెలు తినేవారిలో జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని చెబుతున్నారు.
Also Read: రాత్రి భోజనం తరువాత అరటిపండు తినవచ్చా..? తినకూడదా..?
షుగర్ సమస్యతో బాధపడే వాళ్లు డైట్ లో జొన్న రొట్టెలను చేర్చుకుంటే మంచిది. జొన్న రొట్టెలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల జొన్న రొట్టెలు నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. జొన్న రొట్టెలు శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంతో పాటు సెల్ గ్రోత్ కు సహకరిస్తాయి. రోజూ జొన్న రొట్టెలు, జొన్నలతో చేసిన ఇతర ఆహారపదార్థాలు తీసుకునే వారు క్యాన్సర్ బారిన తక్కువగా పడతారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
జొన్నలు వయస్సు కనిపించకుండా చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జొన్నలు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి. జొన్నలు క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఉదర సమస్యలకు సైతం జొన్నలు సులభంగా చెక్ పెడతాయి. బీ6 విటమిన్ ఎక్కువగా ఉండే జొన్నలు శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణమే ఇవ్వడంలో సహాయపడతాయి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
అనారోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు త్వరగా కోలుకోవడంలో జొన్న రొట్టెలు తీసుకుంటే మంచిది, పాలిచ్చే తల్లులు జొన్నలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మరీ మంచిది. జొన్నలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి జీర్ణసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. జొన్నలను రొట్టెల రూపంలో వేరే విధంగా కానీ తీసుకుని ఈ ఆరోగ్య పయోజనాలను పొందవచ్చు.