వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం వెతుకుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

కరోనా మహమ్మారి విజృంభించి నెలలు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ ఏడాది మార్చి నెల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారానే ఉద్యోగాలు […]

Written By: Navya, Updated On : December 12, 2020 10:50 am
Follow us on


కరోనా మహమ్మారి విజృంభించి నెలలు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ ఏడాది మార్చి నెల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారానే ఉద్యోగాలు చేసే అవకాశం ఇచ్చాయి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త… విశాఖ షిప్ యార్డులో ఉద్యోగాలు..?

అయితే కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్లు సైతం మారిన పరిస్థితుల దృష్ట్యా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యొగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మోసగాళ్లు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లను టార్గెట్ చేసుకుని కొత్తరకం మోసాలకు తెర లేపుతున్నారు. పేపర్లలో, జాబ్ పోర్టల్స్ లో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటూ కుప్పలుతెప్పలుగా ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ జాబ్స్ లో మెజారిటీ జాబ్స్ ఫ్రాడ్ జాబ్స్ కావడం గమనార్హం.

Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ.42,500 వేతనంతో ఉద్యోగాలు..?

డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బులు చెల్లిస్తామని.. పది రోజుల్లో 100 పేజీలు ఎంట్రీ చేయాల్సి ఉంటుందని పలు కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయి. సైబరాబాద్ పోలీసులు ఒక వ్యక్తి ఇలా ఫేక్ ప్రకటనల ద్వారా నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు. వేల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు అతని చేతిలో మోసపోయారు. ఆ వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేశాదు.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

5 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి నిరుద్యోగులు పంపే డబ్బును ఆ బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చేసుకున్నాడు. డబ్బు జమ చేసిన వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.