
దేశంలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోని వాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాలేయ వ్యాధులలో ఒకటైన సిరోసిస్ బారిన పడిన వాళ్లు కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మరణించే అవకాశాలు 30 రెట్లు ఎక్కువగా ఉంటాయని అమెరికా ఆరోగ్య సంస్థలలో ఒకటైన సిడిసి తెలిపింది. శరీరంలో కాలేయం ఏకంగా 500 విధులు నిర్వహిస్తుంది.
శరీరానికి శక్తిని అందించడంతో పాటు హార్మోన్లను నియంత్రిచడం, రక్తం గడ్డ కట్టడానికి సహాయపడటం, టాక్సిన్స్ నుంచి రక్షించడం విషయంలో కాలేయం సహాయపడుతుంది. 7 రోజుల డైట్ ప్లాన్ ను ఫాలో కావడం వల్ల కాలేయంలోకి విష మూలకాలను దాని నుంచి బయటకు తీయడం సాధ్యమవుతుంది. బలమైన కాలేయం కోసం కాలేయ ప్రక్షాళన ఆహారాలు తీసుకోవాలి. కూరగాయలు, పప్పుధాన్యాలు, సేంద్రీయ పండ్లను ఎక్కువగా తింటే మంచిది.
వీటిలో ఉండే గ్లూటాతియోన్ కాలేయం ఆరోగ్యంగా ఉండటంలో ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లి ఆకులు, సిట్రస్ పండ్లు, కాయలు, విత్తనాలు, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. కాలేయానికి మేలు చేసే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. పెరుగు, ఇడ్లీ, పన్నీర్ లాంటి పులియబెట్టిన ఆహారం వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
ఫలితంగా శరీరంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా చేరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ నిద్ర మేల్కొనే, తినే సమయాలను సరి చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. పసుపు టీ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక పదార్థాలు శరీరంలో చేరతాయి. హెర్బల్-టీ తాగితే కాలేయం చురుకుగా ఉండటంతో పాటు జీవక్రియ మెరుగుపడుతుంది.