జుట్టు రాలుతోందా.. జుట్టు విషయంలో చేయకూడని తప్పులు ఇవే..?

వర్షాకాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలామందిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. మందులు వాడినా, షాంపూలు వాడినా జుట్టు సమస్యకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో మనం చేసే తప్పుల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. జుట్టు విషయంలో కొన్ని తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. జుట్టు రాలడం వల్ల హెయిర్ పలుచన అయ్యే అవకాశం ఉంటుంద్. కొన్నిసార్లు జుట్టు కోసం వాడే ఉత్పత్తుల వల్ల దుష్ప్రభావాల బారిన పడే […]

Written By: Navya, Updated On : July 18, 2021 12:41 pm
Follow us on

వర్షాకాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలామందిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. మందులు వాడినా, షాంపూలు వాడినా జుట్టు సమస్యకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. చాలా సందర్భాల్లో మనం చేసే తప్పుల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. జుట్టు విషయంలో కొన్ని తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. జుట్టు రాలడం వల్ల హెయిర్ పలుచన అయ్యే అవకాశం ఉంటుంద్.

కొన్నిసార్లు జుట్టు కోసం వాడే ఉత్పత్తుల వల్ల దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య అంతకంతకూ పెరుగుతుంది. జుట్టుకు హెయిర్ ఆయిల్ రాయకుండా షాంపూను వినియోగించినా జుట్టు రాలుతుంది. షాంపూ చేయడం ద్వారా జుట్టు తేమ పోతుంది. అందువల్ల వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే షాంపూ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బ్లో-డ్రైయర్స్ లేదా ఇతర హీట్ స్టైలింగ్ ఉత్పత్తులు కూడా జుట్టును పొడిగా మారుస్తాయి.

వీలైనంత వరకు అలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. తరచుగా బయటి ఆహారం తినేవాళ్లను సైతం జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కూరగాయలు, సలాడ్, పెరుగు, మజ్జిగ, తాజా పండ్లు, మొలకలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

తడి జుట్టు దువ్వడం, లేదా బ్రష్ చేయడం వల్ల వాటి మూలాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు తరచూ తడి జుట్టును తువ్వాలతో గట్టిగా తుడిచినా జుట్టుకు నష్టం కలుగుతుంది. తడి జుట్టు మీద టవల్ ను వినియోగించకూడదు.